వర్షాకాలం రానే వచ్చింది.వేసవి వేడి నుండి ఉపశమనాన్ని అందిస్తూ వర్షాలు మనసుకు మంచి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.
అయితే వర్షాకాలం అనేక వ్యాధులకు మూలం.వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి.ఈ వర్షాల్లో తడిచామంటే జలుబు( Cold ), దగ్గు వెంటనే పట్టేసుకుంటాయి.
ఇంట్లో ఒకరికి జలుబు, దగ్గు( cough ) పట్టుకున్నాయి అంటే మిగతా వారికి కూడా సులభంగా వ్యాప్తి చెందుతాయి.మీరు కూడా వర్షంలో తడిచి జలుబు, దగ్గు తెచ్చుకున్నారా.
అయితే వెంటనే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.
ఈ డ్రింక్ జలుబు, దగ్గు ను చాలా వేగంగా తగ్గిస్తుంది.
అదే సమయంలో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్లు సోంపు, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న పదార్థాలు మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ను వన్ టేబుల్ స్పూన్ వేయాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Ginger ) వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ బెల్లం పౌడర్ మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధం అయినట్లే.ఈ డ్రింక్ ను ఉదయం మరియు నైట్ నిద్రించే ముందు తీసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ సూపర్ స్ట్రాంగ్ గా మారుతుంది.
దీంతో జలుబు దగ్గు దెబ్బకు పరార్ అవుతాయి.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ప్రస్తుత వర్షాకాలంలో వేధించే ఎన్నో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
చాలామంది నైట్ నిద్ర పట్టడం లేదని బాధపడుతుంటారు.అయితే ఈ డ్రింక్ ను తీసుకుంటే నిద్రలేమి( Insomnia ) దూరం అవుతుంది.
అదే సమయంలో జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.