సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ముఖ చర్మంపై పెట్టే శ్రద్ధ.మెడపై చూపనే చూపరు.
ముఖానికి ఎన్నెన్నో క్రీములు, లోషన్లు, సీరమ్‌లు వాడతారు.కానీ, మెడను అస్సలు పట్టించుకోరు.
అందువల్లనే కొందరు ముఖం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.మెడ మాత్రం లావుగా, నల్లగా, ముడతలు పడి అందవిహీనంగా కనిపిస్తుంటుంది.
కానీ, ముఖంతో పాటు మెడ కూడా నాజూగ్గా, తెల్లగా, అందంగా కనిపించాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మరి మెడ విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
వారంలో కనీసం మూడు సార్లు అయినా మెడకు మసాజ్ చేసుకోవాలి.బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌ను లైట్‌గా హీట్ చేసి.
మెడకు పట్టించి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.మసాజ్ తర్వాత మెడకు సంబంధించి వ్యాయామాలు చేయాలి.
తద్వారా సాగిన చర్మం టైట్‌గా మారుతుంది.మరియు మెడ వద్ద ఏమైనా కొవ్వు పేరుకుని ఉంటే కరిగిపోతుంది.
దాంతో మెడపై ముడతలు పోయి నాజూగ్గా మారుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో అర కప్పు వాటర్, ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిని దూది సాయంతో మెడకు అప్లై చేసి.పది నిమిషాల తర్వాత నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేస్తే గనుక మెడపై ఏమైనా మచ్చలు ఉంటే తొలగిపోయి అందంగా మారుతుంది.
మెడ నలుపు పోవాలంటే.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బరి పాలు, ఒక స్పూన్ కీరదోస పేస్ట్, చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి.
కాస్త డ్రై అయిన తర్వాత స్మూత్‌గా స్క్రబ్ చేసుకుంటూ కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే నలుపు పోవడమే కాదు.
మెడ మృదువుగా, కోమలంగా మారుతుంది.