అమెరికా ఇమ్మిగ్రేషన్ కోర్టులలో( US Immigration Courts ) ఆంగ్లేతర వలసదారులకు చట్టపరమైన ప్రాతినిథ్యంలో అసమానతలపై నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్( Satnam Singh Chahal ) ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) ఇటీవల ఇంగ్లీషును అధికారిక భాషగా మారుస్తూ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం ఇమ్మిగ్రేషన్ కోర్టులలో జారీ చేయబడిన 1,57,577 తొలగింపు ఉత్తర్వులలో 82.5 శాతం మందికి చట్టపరమైన ప్రాతినిథ్యం లేదు.
స్పానిష్ మాట్లాడే వారిలో ఈ అసమానత అత్యంత తీవ్రంగా ఉంది.తొలగింపును ఎదుర్కొంటున్న వారిలో అతిపెద్ద సమూహంగా ఉన్నారని.వీరిలో కేవలం 14.5 శాతం మంది మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.దీనికి వీరుద్ధంగా ఇమ్మిగ్రేషన్ కోర్టులలో మైనారిటీ కింద పంజాబీ మాట్లాడేవారు అత్యధిక ప్రాతినిధ్య రేటును కలిగి ఉండటంతో పాటు 81.6 శాతం మంది చట్టపరమైన సహాయం పొందారు.ఈ డేటా వలస కోర్టులలో చట్టపరమైన ప్రాతినిథ్యంలో కొనసాగుతున్న సంక్షోభాన్ని హైలైట్ చేస్తుందని చాహల్ తెలిపారు.

పంజాబీ మాట్లాడే వలసదారులకు న్యాయ సలహా విషయంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ.ఆంగ్లం మాట్లాడని ఇతర వ్యక్తులలో ఎక్కువ మంది వ్యవస్థాగత అడ్డంకులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల కారణంగా న్యాయ ప్రక్రియపై గణనీయంగా ప్రభావం చూపుతుందని న్యాయవాదులు భయపడుతున్నారని ఛాహాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇమ్మిగ్రేషన్ కోర్టులలో న్యాయాన్ని నిర్ధారించడానికి భాష కూడా అవసరమని.సరైన ప్రాతినిధ్యం లేకుండా వేలాది మంది అన్యాయంగా బహిష్కరణకు గురవుతున్నారని ఆయన తెలిపారు.

ఆంగ్లం మాట్లాడని వలసదారులకు తగిన చట్టపరమైన వనరులు, వివరణ సేవలను అందించే ప్రయత్నాలను బలోపేతం చేయాలని విధాన నిర్ణేతలు, చట్టపరమైన న్యాయవాదులు, పౌర సమాజ సంస్థలకు ఎన్ఏపీఏ పిలుపునిచ్చింది.వలస చర్యలలో వ్యక్తులు న్యాయమైన విచారణను పొందకుండా భాషాపరమైన అడ్డంకులు నిరోధించకుండా చూసుకోవాలని ట్రంప్ అధికార యంత్రాంగం, కాంగ్రెస్ నేతలను ఎన్ఏపీఏ కోరింది.







