టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సిద్ధు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) ఒకరు.డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఏప్రిల్ నెల 10వ తేదీన జాక్ సినిమాతో( Jack Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు, ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని బూతులు ఉన్నప్పటికీ సిద్ధు మార్క్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు.
బేబీ సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీ.
వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.ఎస్వీసీసి బ్యానర్ కు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కీలకం అనే సంగతి తెలిసిందే.
సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కాగా బొమ్మరిల్లు భాస్కర్ తన శైలికి భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సిద్ధు మార్క్ డైలాగ్స్ ఇష్టపడే వాళ్లకు మాత్రం జాక్ నచ్చే ఛాన్స్ ఉంది.వరుస ప్రాజెక్ట్ లతో సిద్ధు కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.టిల్లు స్క్వేర్ కు సైతం సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ ప్రాజెక్ట్ మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉనాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.