టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ను మొదలుపెట్టిన వ్యక్తి కుడుముల అ ఆ, జాదూ గాడు, తుఫాన్ వంటి సినిమాలకు వర్క్ చేశారు.
ఆ తర్వాత ఛలో సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.నాగశౌర్య హీరోగా నటించిన ఆ మూవీతో మంచి హిట్ అందుకున్నారు.ఆ తర్వాత రెండో మూవీ భీష్మ నితిన్ తో చేసిన సంగతి విదితమే.2020 లో రిలీజ్ అయిన ఆ సినిమాతోనూ హిట్ కొట్టేశారు.అలా ఛలో, భీష్మతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల, మెగాస్టార్ చిరంజీవితో( Megastar Chiranjeevi ) మూవీ చేసే గోల్డెన్ ఛాన్స్ సాధించారు.2021 డిసెంబర్ లో ఆ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.దీంతో అంతా ఒక్కసారి షాకయ్యారు.

మూడవ సినిమా చిరుతో చేసే ఛాన్స్ అందుకున్నారు అంటే మామూలు విషయం కాదని అంతా అనుకున్నారు.కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.ఎందుకంటే ముందు స్టోరీ లైన్ ను బాగా నచ్చిన చిరు తర్వాత స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
మరో స్టోరీ రాసుకుని వస్తే తప్పకుండా మూవీ చేద్దామని అన్నారు.ఆ విషయాన్ని రీసెంట్ గా వెంకీ కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.నితిన్ తో( Nithin ) వెంకీ మరో మూవీకి కమిట్ అయ్యారు.నితిన్, శ్రీలీల జంటగా రాబిన్ హుడ్ మూవీని( Robinhood Movie ) తెరకెక్కించారు.
అయితే కచ్చితంగా రాబిన్ హుడ్ మూవీ హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు.కానీ ఆ సినిమా ఆడియన్స్ ను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.

దాంతో హీరో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.వెంకీ కుడుములకు హ్యాట్రిక్ మిస్ అయింది.పెద్ద హిట్ కొడతాను అనుకున్న ఆయన ఆశలకు గండి పడింది.కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందనుకుంటే రివర్స్ అయింది.2020లో భీష్మ వస్తే 2025లో రాబిన్ హుడ్ రిలీజైంది.ఐదేళ్ల గ్యాప్ తర్వాత కొత్త మూవీ తీసిన వెంకీ డిజాస్టర్ అందుకున్నారు.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.అప్పుడు చిరంజీవితో మూవీ చేసే ఛాన్స్ పోయింది.
ఇప్పుడు ఐదేళ్ల తర్వాత తీసిన రాబిన్ హుడ్ ఫ్లాప్ గా మారిందని కామెంట్లు పెడుతున్నారు.చిరంజీవితో మూవీపై ఫోకస్ చేసి ఉన్నా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి మెగాస్టార్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు.వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో క్రేజీ అండ్ భారీ మూవీస్ చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్ వెంకీ కుడుముల జాతకం మాత్రం బాగాలేదని చెప్పాలి.ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.