సినిమాల్లో కమెడియన్స్ ఎప్పుడు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.సినిమాల్లోనే కాదు బయట కూడా ఎంతో సరదా సరదాగా గడుపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
దీంతో ఇలా అందరినీ నవ్వించే కమెడియన్స్ కి అసలు ఎలాంటి బాధలు ఉండవు అని ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటారని ఇలాంటి బాధలు లేని జీవితం అందరికీ ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటూ ఉంటారు ప్రేక్షకులు.కానీ తెరమీద కనిపించి నవ్వించే కమెడియన్స్ ని కదిలిస్తే గుండెలు తరుక్కుపోయే బాధలు కూడా ఉంటాయి అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఇక ఇప్పుడు హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ వెండితెరపై ఎంతో చలాకీగా కనిపించే మాస్టర్ భరత్ విషయంలో కూడా ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయట.చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకీ, ఢీ, రెడీ, దూకుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకున్నాడు.
కాస్త పెద్దయ్యాక బాడీ పెంచి హీరోల ఫ్రెండ్ పాత్రలో కనిపించడం మొదలు పెట్టాడు.గత కొంతకాలం నుంచి మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సినిమాలోనూ కనిపించటం లేదు.
అయితే భరత్ సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏమిటి అన్నది మాత్రం కేవలం కొంతమంది అభిమానులకు మాత్రమే తెలుసు.ప్రస్తుతం మాస్టర్ భరత్ ఒకవైపు సినిమాలను హ్యాండిల్ చేస్తూనే మరోవైపు డాక్టర్ కోర్సు కూడా పూర్తి చేశాడట.డాక్టర్ గా బిజీ అవడం వల్లే సినిమాలు చేయలేకపోతున్నాడు అని తెలుస్తోంది.మాస్టర్ భరత్ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడట.చెన్నైలో చదువుకుంటున్న సమయంలో ఒక భారీ యాక్సిడెంట్ జరిగిందట.ఈ క్రమంలోనే ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్క సారిగా సన్నబడి పోయాడట.
జిమ్లో వర్కవుట్ చేస్తున్న సమయంలో కళ్ళలో రాడ్ గుచ్చుకోవడంతో కంటి లో బ్లాక్ ఏర్పడిందట.ఎన్ని మందులు వాడినప్పటికీ సమస్య తీరలేదట.
ఇప్పటికి కూడా ఈ సమస్య వల్లబాధపడుతూ ఉన్నాడట.ఇలా అందరినీ నవ్వించే మాస్టర్ భరత్ జీవితంలో ఇలాంటి విషాదకర ఘటన గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.