ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ ఏ, బి, సి, డి లను మనం తరచుగా వింటూనే ఉంటాము.కానీ విటమిన్ P ( Vitamin P )అనేది ఒకటి ఉందని దాదాపు చాలా మందికి తెలియదు.
అసలు ఈ విటమిన్ పి సంగతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ విటమిన్ పి అనేది కచ్చితంగా విటమిన్ అని కూడా అని కాదు.
ఇంకా చెప్పాలంటే ఫ్లేవనాయిడ్స్‌ని విటమిన్ P అని కూడా అంటారు.అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ( Antioxidants, anti-inflammatory ) ప్రాపర్టీలు అని అర్థం వస్తుంది.
ఇంకా చెప్పాలంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీలు కలిగిన ఒక ఫైటో న్యూట్రియంట్.సింపుల్ గా చెప్పాలంటే ఈ విటమిన్ P అనేది ఎక్కువగా మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలలో ఉంటుంది.

ఈ విటమిన్ P అనేది ఇంకా దేని నుంచి లభిస్తుందో దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ పీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే రక్తనాళాల పని తీరు కూడా మెరుగుపడుతుంది.విటమిన్ పి అనేది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తూ ఉంటుంది.కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని( Immunity ) కూడా పెంచుతుంది.అలాగే ఆస్తమా, కీళ్లవాతం, అలర్జీలు రాకుండా రక్షిస్తుంది.

వారికోస్ వీన్స్, చర్మం పై కమిలినట్లు ఉండడం వంటివి రాకుండా ఆపుతుంది.ఇంకా చెప్పాలంటే కంటి శుక్లాలు రాకుండా చూపు తగ్గకుండా చేస్తుంది.బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.అయితే క్యాన్సర్ పై విటమిన్ పి చూపు ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది.ఇంకా చెప్పాలంటే నిమ్మ జాతికి చెందిన పండ్లలో ఈ విటమిన్ పి ఎక్కువగా ఉంటుంది.
అలాగే హై క్వాలిటీ డార్క్ చాక్లెట్లలోనూ ఇది లభిస్తుంది.కాకపోతే ఈ చాక్లెట్లో కోకో 70% వరకు ఉండాలి.
ఇలా బెర్రీ జాతికి చెందిన అన్ని పండ్లలో ఇది లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే రెడ్ వైన్ ఆకుకూరలలో ఇది ఎక్కువగా ఉంటుంది.
ఇలా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మీ డైట్ లో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్ని అందుతాయి.