బుద్ధుడి( Buddha ) జీవితంలో వైశాఖ పూర్ణిమ( Vaishakh Purnima ) ఎంతో ప్రత్యేకమైనది.గౌతమ బుద్ధుడు భూమండలా ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఉంటారు.
తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే గౌతముని బుద్ధుడిగా మార్చిన బోధి వృక్షానికి పూజ చేసే ఆచారం ఆ కాలంలోనే మొదలైంది.బేతవన విహారంలో బుద్ధుడు బస చేసి ఉన్న రోజులలో ఒక రోజు ఒక భక్తుడు పులు తీసుకొస్తాడు.ఆ సమయంలో గౌతముడు లేకపోవడంతో చాలాసేపు వేచి చూసి నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు.
దీనిని గమనించిన భేతావన విహారదాత ఆనందా పిండకుడు బుద్ధుడు వచ్చిన వెంటనే ఈ విషయం వివరించాడు.

ఆయన లేనప్పుడు పూజ సాగేందుకు అక్కడ ఏదైనా వస్తువు ఉంచాల్సిందిగా కోరాడు.విగ్రహారాధనకు అనుమతించని బుద్ధుడు వృక్షానికి పూజలు చేయమని చెప్పాడు.అప్పటినుంచి బేతవన విహారంలో ఒక బోధి వృక్షాన్ని నాటి ఆనందుడు పెంచాడు.
ఇదంతా జరిగింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే అని చెబుతూ ఉంటారు.సంవత్సరానికి ఒకసారి వైశాక పౌర్ణమి రోజు బోధి వృక్షానికి పూజలు చేయడం ఆచారంగా వస్తోంది.
బౌద్ధమతం వ్యాపించిన అన్ని దేశాలలో వైశాఖ పూర్ణిమ పూజ ఘనంగా జరుగుతుంది.రంగూన్, పెగు, మాండలే ప్రాంతాలలో బుద్ధ పౌర్ణమి అత్యంత వైభవంగా నియమ నిష్ఠతో చేస్తారు.
బుద్ధ పూర్ణిమ రోజు సాగే ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు.మేళ తాళాలు,దీపాలు, జెండాలు పట్టుకొని ఊరంతా తిరిగి సాయంత్రానికి కుండలలోని జలాలను వృక్షాల మొదట్లో వేస్తారు.

అలాగే దీపాలు వెలిగించి చెట్టుకి జెండాలు కడతారు.ఈ సంప్రదాయం హిందువులు ఆచరించే వంట వటసావిత్రి వ్రతం నుంచి మొదలైంది అని కూడా చెబుతూ ఉంటారు.ఆ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి పూజ ద్రవ్యాలు తీసుకొని మర్రిచెట్టు( Banyan ) దగ్గరకు వెళ్లి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ “నమో వైవస్వతాయ” అనే మంత్రాన్ని పాటిస్తూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.