ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు డబ్బు సంపాదించాలనే అనుకుంటూ ఉంటారు.ఉద్యోగము, వ్యాపారం( Job, business ) చేసి డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్న దానినీ బట్టి మన జీవితం ఎంతవరకు విజయవంతంగా ఉందనే అంచనా వేస్తూ ఉంటారు.
ఇలా జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి మన సనాతన శాస్త్రాలు మనకు రకరకాల నియమాలు చెబుతున్నాయి.వాస్తు కూడా అలాంటి నియమాల శాస్త్రమే.
వాస్తు నిర్మాణ శాస్త్రం( Architecture )మాత్రమే కాదు.వాస్తు నియమానుసారంగా నివసించే ప్రదేశాలు, పని ప్రదేశాలు అన్నీ చోట్ల ఏర్పాటు చేసుకోవడం విజయానికి సోపానం చేస్తుంది.
సాధారణంగా చెప్పాలంటే నివసించే ప్రాంతాల నిర్మాణ సమయంలో వాస్తు గురించి తీసుకునే శ్రద్ధ, పని ప్రదేశాల నిర్మాణ స్థలం సమయంలో పెద్దగా పట్టించుకోరు.కానీ కార్యాలయాలు, వ్యాపార స్థలాలో కూడా వాస్తు నియమానుసారం ఉన్నప్పుడే లక్ష్మి అనుగ్రహం ( Grace of Lakshmi )ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార స్థలం లేదా ఆఫీస్ వంటి పని చేసే ప్రదేశాలలో సరైన దిశలో కూర్చొని పనిచేసుకోవడం కూడా ప్రభావాన్ని చూపుతుందని పండితులు చెబుతున్నారు.కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గది దక్షిణం లేదా పశ్చిమ దిక్కున ఉండడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.ఒకవేళ ఈ విధంగా లేకపోతే అటువైపుగా ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం అని చెబుతున్నారు.

ఆ గదిలో మీరు కుర్చున్నప్పుడు ఉత్తరం లేదా తూర్పు దిక్కున మీ ముఖం ఉండేటట్లుగా చూసుకోవడం ఎంతో మంచిది.మేనేజింగ్ డైరెక్టర్ గదిలో టేబుల్ కుర్చీలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.ఇలా ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మీ వ్యాపారంలో పెరుగుదల చూస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే దుకాణం లో అమ్మడానికి ఉంచే వస్తువులు దక్షిణం, పడమర, వాయువ్య దిశా అంటే పడమర, ఉత్తర గోడలు కలుసుకునే మూలలో వస్తువులను ఉంచడం మంచిది.
తూర్పు, ఉత్తరాల మధ్య అంటే ఈశాన్య, దక్షిణాల మధ్య ఖాళీగా వదిలేయడమే మంచిది.