తలరాతలు మార్చే మహాశక్తి యోగం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే..!

జాతక చక్రంలో గాని గ్రహచారంలో కానీ మీ రాశి వెనుక శని లేదా రాహు లేదా కేతు గ్రహం ప్రవేశించినప్పుడు దానిని మహాశక్తి యోగంగా పరిగణిస్తారు.దీనివల్ల ఆ రాశి వారికి ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటివి అసాధారణంగా పెరిగి ఎటువంటి పనినైనా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

 Mahashakti Yoga That Changes The Head. , These Are Best Zodiac Signs , Zodiac-TeluguStop.com

జ్యోతిష్య శాస్త్రంలో ఇదొక అరుదైన యోగం.ప్రస్తుతం గ్రహచారం ప్రకారం వృషభం, వృశ్చికం, మీనరాశుల వారికి ఈ మహాశక్తి యోగం పట్టనుంది.

దీనివల్ల ఈ రాశుల వారికి జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.ఈ రాశుల వారికి కూడా ఈ యోగం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Astrology, Rashi Phalalu, Rasi Falalu, Scorpio, Taurus, Vrushabha Rasi, Z

వృషభ రాశికి( Vrushabha Rasi ) 12వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది.దీనివల్ల కొన్ని అసాధ్యమైన పనులు సుసాధ్యమవుతాయి.విదేశాలలో ఉద్యోగం కోసం చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.అక్టోబర్ 24వ తేదీలోగా ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలతో పాటు కొన్ని వ్యక్తిగత కుటుంబ సంబంధమైన పనులను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఉంది.అలాగే మీన రాశి( Pisces ) వారికి 12వ స్థానంలో శని సంచారం కారణంగా మహాశక్తి యోగం పట్టింది.

ఈ యోగం వల్ల వీరిలో కార్యసిద్ధికి వ్యవహారయానికి అవకాశం ఏర్పడుతుంది.ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ కొద్ది ప్రయత్నాలతో, కొద్ది చొరవతో ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.

Telugu Astrology, Rashi Phalalu, Rasi Falalu, Scorpio, Taurus, Vrushabha Rasi, Z

ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి( Scorpio ) 12వ స్థానంలో కేతువు గ్రహం సంచరించడం వల్ల వీరికి అక్టోబర్ 24 వరకు మహాశక్తి యోగం ఏర్పడబోతోంది.దీని వల్ల వీరు జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.ఈ రాశి వారిలో స్వయంకృషి విపరీతంగా అభివృద్ధి చెందుతుంది.ఎటువంటి పరిస్థితులలోనూ జీవితాల్లో పైకి రావాలనే తపన పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube