ఈనెల 5వ తేదీన అరుదైన చంద్రగ్రహణం( Lunar eclipse ) ఏర్పడబోతోంది.ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం కూడా ఇదే కావడం విశేషం.
అయితే ఈసారి ఏర్పడే అరుదైన చంద్రగ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహంగా చెబుతున్నారు.భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం మే 5వ తేదీన రాత్రి 8 గంటల 44 నిమిషములకు మొదలవుతుంది.
అలాగే ఈ చంద్రగ్రహణం రాత్రి పది గంటల 52 నిమిషములకు గరిష్టానికి చేరుకుంటుంది.
మే 6వ తేదీన ఉదయం 1.01 సమయానికి పెనుంబ్రల్ చంద్రగ్రహణం ముగిసిపోతుంది.ఇక చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సంపూర్ణ చంద్రగ్రహణాలు, పాక్షిక చంద్ర గ్రహణాలు, పెనుంబ్రల్ చంద్రగ్రహణాలు ఏర్పడుతాయని చెబుతున్నారు.మే 5వ తేదీన పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడడం ఈ చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత.
చంద్రుడు భూమి ( Earth )యొక్క బయట నీడ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది.ఈ మధ్యకాలంలో తొలి సూర్యగ్రహణం ఏర్పడగా ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడింది.
ముఖ్యంగా చెప్పాలంటే ఆకాశం నిర్మలంగా ఉండే భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో చంద్రగ్రహణం కనిపిస్తుంది.మే 5వ తేదీన ఏర్పడబోయే చంద్రగ్రహణం కొన్ని భాగాలను ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాలలో చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చంద్రగ్రహణాన్ని చూడాలనుకునేవారు మే 5వ తేదీన 8.44 తర్వాత చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు.ఆకాశం స్పష్టంగా ఉంటే నేరుగా చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.
లేదంటే టెలిస్కోపు( Telescope )ను కానీ, బైనాక్యులర్ ను కానీ ఉపయోగించి చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం ఉంటుంది.
సూర్య గ్రహణాలను నేరుగా కంటితో చూడడం ప్రమాదం కానీ ఈ చంద్రగ్రహణానికి అటువంటి ప్రమాదం ఏమీ ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్రగ్రహణం భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్య తిరుగుతున్న సమయంలో చంద్రునిపై నీడ పడడం వల్ల ఏర్పడుతుంది.
ప్రస్తుతం మే 5వ తేదీన దేశంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుందంటే మళ్ళీ అక్టోబర్ 28, 29 తేదీల మధ్య రెండో చంద్రగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ముందుగానే చెబుతున్నారు.