కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ (Kalyan Ram, Saiee Manjrekar)జంటగా నటించిన లేటెస్ట్ సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి(arjun son of vyjayanthi).ఇందులో విజయశాంతి (Vijayashanti)కూడా నటించిన విషయం తెలిసిందే.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశోక్ క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ (Ashok Creations NTR Arts Banner)పై నిర్మించారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 18 థియేటర్లలో గ్రాండ్గా విడుదల అయింది.మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా కథ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.
కథ:
వైజయంతి(విజయశాంతి) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.అతని కొడుకు అర్జున్(కళ్యాణ్ రామ్)ని పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటుంది.కానీ తన తండ్రిని చంపినవాళ్ళల్లో ఒకరిని అర్జున్ హత్య చేస్తాడు.దీంతో తల్లే అర్జున్ పై హత్య కేసు పెట్టి దూరమవుతుంది.అయితే ఆ కేసు నడుస్తుండగానే అర్జున్ వైజాగ్ నే తన కంట్రోల్ తెచ్చుకొని ఒక రౌడీగా ఎదుగుతాడు.
వైజాగ్ లోని ఒక జాలరి పేటలో తన భార్యతో కలిసి ఉంటాడు అర్జున్.తల్లి తనని దూరం పెట్టినా అర్జున్ తల్లిని చూడాలని, కలవాలని, మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు.
అర్జున్ భార్య చిత్ర(సయీ మంజ్రేకర్) ప్రెగ్నెంట్ అయిన సమయంలో తన తల్లి వైజయంతి పై అటాక్ జరుగుతుంది.అసలు వైజయంతి పై అటాక్ చేసింది ఎవరు? తల్లి కొడుకులు విడిపోవడానికి అసలు కారణం ఏంటి? అర్జున్ ఎందుకు హత్య చేస్తాడు? చివరికి తల్లి కొడుకులు ఒకటి అయ్యారా లేదా? అర్జునుని పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకున్న వైజయంతి కోరిక నెరవేరిందా లేదా? ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:

తప్పు చేస్తే పిల్లలను దూరం పెట్టి బుద్ధి చెప్పాలి అన్న లైన్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.ఇది కూడా అలాంటి సినిమానే అయినప్పటికీ కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ వర్సెస్ వైజయంతి అని, ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు అని చూపించి ఎందుకు అని ఒక ఆసక్తి నెలకొల్పుతారు.ఫస్ట్ హాఫ్ రొటీన్ కమర్షియల్ సినిమాల లాగే ఉంటుంది.
ఇక సెకండ్ హాఫ్ ముందు ఒక ట్విస్ట్ ఇచ్చి అసలు ఫైట్ వేరు అని ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తారు.సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పి కథలో వదిలేసిన చాలా పాయింట్స్ కి లింక్ కలుపుతారు.
దీంతో సెకండ్ హాఫ్ బాగానే వర్కౌట్ అయింది.క్లైమాక్స్ కాస్త సాగదీశారని చెప్పాలి.
ఇందులో తల్లి సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది.ఇందులో చాలానే లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి.
నటీనటుల పనితీరు:

కాగా ఎప్పటీ లాగే కళ్యాణ్ రామ్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ పాత్రలో బాగానే చేసినా క్లైమాక్స్ లో మాత్రం అదరగొట్టాడని చెప్పాలి.క్లైమాక్స్ కి కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు అంటే సాహసం అనే చెప్పవచ్చు.ఒకప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో మెప్పించిన విజయశాంతి చాన్నాళ్ల తర్వాత మళ్ళీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు.
ఈ ఏజ్ లో కూడా భారీ యాక్షన్స్ చేసి మెప్పించడం చాలా గ్రేట్ అని చెప్పాలి.శ్రీకాంత్ పోలీస్ పాత్రలో బాగానే మెప్పించాడు.బబ్లూ పృథ్వీరాజ్ కి మంచి పాత్ర పడింది.బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ నెగిటివ్ షేడ్స్ లో ఓకే అనిపించాడు.మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రలో పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతిక:

సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా కొట్టారు.ఇంకా చెప్పాలంటే అదిరిపోయింది అని చెప్పవచ్చు.
పాటలు కూడా ఒక్కసారి వినవచ్చు.రెగ్యులర్ కథని కొత్త స్క్రీన్ ప్లేతో కొత్త క్లైమాక్స్ తో చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు.
నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు అనిపిస్తుంది.కెమెరా వర్క్స్ కూడా బాగానే ఉన్నాయి.