మార్స్‌పై భారీ మిస్టరీ హోల్.. మరో లోకానికి దారా? NASA షాకింగ్ ఫొటోలు వైరల్!

అంగారకుడిపై నాసా(NASA on Mars) కనిపెట్టిన ఒక వింత రంధ్రం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది.నిన్న మొన్నటి దాకా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూసిన సీన్ ఇది.

 మార్స్‌పై భారీ మిస్టరీ హోల్.. -TeluguStop.com

కానీ ఇప్పుడు నిజంగానే మార్స్ గ్రహం మీద ఒక పెద్ద రంధ్రం కనిపించింది.దాదాపు 328 అడుగుల వెడల్పుతో (సుమారు 100 మీటర్లు) ఉన్న ఈ రంధ్రం ఫొటోని నాసా “ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే”(Astronomy Picture of the Day)గా రిలీజ్ చేసింది.

దాంతో సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ అయిపోయింది.ఇది వేరే లోకానికి దారి చూపే గుహ ద్వారమా? ఏలియన్స్ ఉన్నారా అక్కడ? అని దీన్ని చుసినవారందరూ ఒక్కటే అనుకుంటున్నారు.నిజానికి మార్స్‌పై ఇలాంటి రంధ్రాలు చాలానే ఉన్నాయి.వాటిని చూస్తే స్విస్ చీజ్ గుర్తుకు వస్తుంది.

చాలా రంధ్రాలు కార్బన్ డయాక్సైడ్ (Holes carbon dioxide)మంచు పొరల కింద దుమ్ము కొట్టుకుపోయిన నేలను చూపిస్తాయి.కానీ ఈ ఒక్క రంధ్రం మాత్రం చాలా డిఫరెంట్.

ఇది చాలా లోతుగా, చీకటిగా ఉంది.చుట్టూ గుండ్రటి బిలం లాంటి నిర్మాణం కూడా ఉంది.

దీంతో ఇది మామూలు రంధ్రంలా కాదని స్పష్టంగా తెలుస్తోంది.ఖచ్చితంగా చెప్పలేం కానీ, బహుశా ఉల్క పడటం వల్ల ఈ వింత రంధ్రం ఏర్పడి ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ రంధ్రం పెద్ద భూగర్భ గుహలకు దారి తీసే అవకాశం ఉంది.భూమికి భిన్నంగా, మార్స్‌పై వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది.అక్కడ బలమైన అయస్కాంత క్షేత్రం లేదు, దట్టమైన వాతావరణం లేదు.దీనివల్ల హానికరమైన కాస్మిక్, సౌర రేడియేషన్ నేరుగా మార్స్ ఉపరితలంపై పడుతుంది.ఇది జీవులకు చాలా ప్రమాదకరం.కానీ భూమి లోపల ఉండే గుహలు ఈ రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తాయి.

అంటే ఒకప్పుడు మార్స్‌పై జీవం ఉంటే, లేదా ఇప్పుడున్నా సరే, అది ఈ గుహల్లోనే ఉండే అవకాశం ఉంది.

బిలియన్ సంవత్సరాల(Billion years) క్రితం మార్స్ కూడా భూమిలాగే ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.అందుకే మార్స్‌పై జీవం జాడలు కనుక్కోవడానికి ఈ గుహలే బెస్ట్ ప్లేస్ అని భావిస్తున్నారు.2019లోనే యూఎస్‌జీఎస్ ఆస్ట్రోజియాలజీ సైన్స్ సెంటర్ ఒక మ్యాప్ తయారు చేసింది.అందులో మార్స్‌పై వెయ్యికి పైగా గుహల ద్వారాలు ఉన్నట్లు గుర్తించారు.స్పేస్ సైంటిస్ట్ గ్లెన్ కుషింగ్ చెప్పినట్లుగా, ఈ గుహలు ఎంత లోతుగా ఉంటాయో ఎవరికీ తెలియదు.

మొత్తానికి ఈ మిస్టరీ హోల్ ఒక రహస్య ప్రపంచానికి గేట్‌వే కావచ్చు.ఒకప్పుడు మార్స్‌పై జీవం ఉండేదనడానికి, లేదా ఇప్పటికీ ఉందనడానికి ఇది రుజువు కావచ్చు.చూద్దాం, నాసా రోవర్లు, భవిష్యత్తులో వెళ్లే వ్యోమగాములు ఈ గుహల రహస్యాన్ని ఛేదిస్తారేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube