బోటులో నుంచి దూకేసిన వ్యక్తి.. అది చూసిన అతని కుక్క ఎం చేసిందంటే?

పెంపుడు జంతువులు మన జీవితాల్లో ఒక భాగమైపోతాయి.వాటిలో ప్రత్యేకంగా కుక్కలు (Dogs) అన్నింటికీ మించిన విశ్వాసాన్ని కలిగి ఉంటాయి.

 What Did His Dog Do When He Saw The Man Who Jumped Out Of The Boat, Loyal Dog, P-TeluguStop.com

వీటిని కొంతకాలం ప్రేమగా చూసుకుంటే చాలు, అవి జీవితాంతం మన కోసం అంకితమవుతాయి.అనేక సందర్భాల్లో పెంపుడు కుక్కలు తమ యజమానులను ప్రమాదాల నుంచి రక్షించిన ఉదాహరణలు ఉన్నాయి.

తాజాగా ఇలాంటి మరో ఉదాహరణ వైరల్‌గా మారింది.

ఇటీవల సోషల్ మీడియాలో( social media ) ఓ ఆశ్చర్య పరిచే వీడియో వైరల్ అవుతోంది.ఇద్దరు వ్యక్తులు తమ పెంపుడు కుక్కను తీసుకుని సముద్రంలో బోటింగ్ చేస్తున్నారు.ఈ క్రమంలో యజమాని ఏదో కారణంతో నీటిలోకి దూకాడు.

బోటు స్పీడ్‌గా వెళ్తుండటంతో అతను వెంటనే దూకేసాడు.ఇది చూసిన కుక్క ఒక్కసారిగా అయోమయానికి లోనైంది.

తన యజమానికి ఏదైనా ప్రమాదం వచ్చిందని భావించిన ఆ కుక్క ఆలోచించకుండా నీటిలోకి దూకింది.ఏమాత్రం భయపడకుండా నీటిలో ఈదుతూ తన యజమానిని చేరుకుంది.

ఆపై అతనిని వెంట తీసుకుంటూ తిరిగి బోటు వద్దకు తీసుకువచ్చింది.ఈ సంఘటన మొత్తాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కల విశ్వాసంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మనిషికి కన్నా కుక్కే అసలైన మిత్రుడని కామెంట్ చేస్తున్నారు.పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటే అవి తమ ప్రేమను నమ్మకంగా, విశ్వాసంగా తిరిగి చెల్లిస్తాయి.ఈ ఘటన కూడా అదే విషయాన్ని మరోసారి తెలిపింది.యజమాని కోసం ప్రాణాల్ని లెక్కచేయకుండా నీటిలోకి దూకిన ఆ కుక్క, నిజమైన లాయల్టీకి నిదర్శనంగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube