బన్నీ, సుకుమర్ ( Bunny, Sukumar )కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను అందుకుని ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప ది రూల్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.బాహుబలి2 మూవీ సాధించిన కలెక్షన్ల రికార్డులను సైతం ఈ సినిమా బ్రేక్ చేసింది.అయితే పుష్ప2 విజువల్ ఎఫెక్ట్స్ ( Pushpa2 Visual Effects )వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా చూస్తున్న సమయంలో ఏది రియలో ఏది గ్రాఫిక్సో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.పుష్ప ది రూల్ సినిమాలో చాలా సహజంగా కనిపించే జపాన్ ఫైట్, మాల్దీవుల సీన్, రామేశ్వరం పడవల ఛేజింగ్, చందన దుంగల లారీని షెకావత్ పట్టుకోవడం, పుష్ప డెన్ లాంటి సీన్స్ అన్నీ గ్రాఫిక్స్ అని తెలిసి నెటిజన్లు ఒకింత షాకవుతున్నారు.

సుకుమార్ రైటింగ్స్ సంస్థ ( Sukumar Writings Company )యూట్యూబ్ వేదికగా ఈ వీడియోను రిలీజ్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.పుష్ప2 సినిమా గ్రాఫిక్స్ కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ ఇతర భాషల్లో సైతం అంచనాలను మించి సక్సెస్ సాధించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.

పుష్ప ది రూల్ కు సీక్వెల్ గా పుష్ప ది ర్యాంపేజ్ తెరకెక్కనుండగా 2028 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది.పుష్ప ది ర్యాంపేజ్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ 800 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.