ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ (Indian Street Food)కు ఉన్న క్రేజే వేరు.ఘాటైన రుచులు, రకరకాల వెరైటీలతో ఎవరికైనా సరే నోరూరించాల్సిందే.
పానీ పూరీ (Pani Puri)నుంచి మెత్తటి అప్పాల వరకు ఇక్కడ అన్నీ ప్రత్యేకమే.ఇటీవల జైయున్నా అనే కొరియన్ అమ్మాయి(A Korean girl named Jaeunna) ఇండియాకి వచ్చి మన స్ట్రీట్ ఫుడ్‌ని టేస్ట్ చేసింది.
ఆ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయిపోయింది.
ఆ వీడియో స్టార్టింగ్‌లో జైయున్నా(Jaeunna) ఇంట్లో ఫోర్క్‌తో ఏదో తింటూ ఉంటుంది.
సీన్ కట్ చేస్తే.వెంటనే ఇండియాలోని రద్దీగా ఉండే ఫుడ్ స్ట్రీట్స్‌లోకి షిఫ్ట్ అవుతుంది.
అక్కడ లోకల్ ఫుడ్ స్టాల్స్‌కి వెళ్లి మన దేశీ వంటకాలని తెగ లాగించేస్తుంది.సౌత్ ఇండియన్ అప్పాలతో తన ఫుడ్ జర్నీ స్టార్ట్ చేస్తుంది.
ఆ తర్వాత ఫ్రైడ్ రైస్, పానీ పూరీ, సేవ్ పూరీ చాట్ (Fried rice, pani puri, sev puri chaat)ఇలా చాలా రకాల టేస్టీ స్నాక్స్‌ని టేస్ట్ చేసింది.
![]()
అసలు ఈ వీడియోకి హైలైట్ ఏంటంటే, జైయున్నా(Jaeunna) ఇచ్చిన రియాక్షన్స్.ప్రతి బైట్ తింటున్నప్పుడు ఆమె ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.ప్రతి డిష్‌ని ఎంజాయ్ చేస్తూ, ముఖ్యంగా పానీ పూరీ టేస్ట్ చూసి అయితే ఆమె ప్రేమలో పడిపోయిందంతే.
వీడియో ఎండింగ్‌లో పెద్ద నవ్వుతో హిందీలో “పానీ పూరీలు సూపర్ ఉన్నాయి అని చెప్పి తన ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చేసింది.
![]()
ఇండియన్ ఫుడ్‌తో ఆమె ఎంతలా కనెక్ట్ అయిపోయిందో వీడియో చూస్తే తెలుస్తుంది.సేవ్ పూరీ క్రంచీగా ఉన్నా, పానీ పూరీ స్పైసీగా ఉన్నా, ప్రతి బైట్‌ని లవ్ చేస్తూ తిన్నది.ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఫుడ్‌పై ఉన్న ఇంట్రెస్ట్ చూసిన నెటిజన్లు జైయున్నా ఫుడ్ అడ్వెంచర్‌కి ఫిదా అయిపోయారు.
జైయున్నా ఈ వీడియోని ఏప్రిల్ 16న పోస్ట్ చేయగా.ఇప్పటికే 28,200 వ్యూస్‌కి పైగా వచ్చాయి.
క్యాప్షన్‌లో “గోల్‌గప్పే మస్త్ హై, ఔర్ మైఁ ఉన్‌సే భీ మస్త్, ఇండియా స్ట్రీట్ ఫుడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా, ఒక్కో టేస్టీ బైట్‌తో” అని రాసుకొచ్చింది.ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌పై ఆమెకున్న లవ్ చూసి చాలా మంది హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.
స్ట్రీట్ ఫుడ్ అంటే తమకి కూడా ఎంత ఇష్టమో చెబుతున్నారు.ఒక కామెంట్‌లో అయితే “చాట్స్ ఆర్ మై ఫేవ్ టూ” అని పెట్టారు.
ఈ వీడియో చూస్తుంటే ఆహారం అనేది కల్చర్స్ మధ్య ఎంతలా కనెక్ట్ చేస్తుందో అనిపిస్తుంది.






