తమిళ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉందా.. ప్రతి నెలా అంత ఇవ్వాల్సిందేనా?

తమిళ సూపర్ స్టార్ అజిత్(Tamil superstar Ajith) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు అజిత్.

 Ajith 15 Crores Per Month Producers Will Get Nothing, Ajith, Remunerations, Prod-TeluguStop.com

అందులో భాగంగానే ఇటీవల గుడ్ బ్యాగ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

అజిత్ (Ajith)తో సినిమా తీయడం అన్నది అంత ఈజీ కాదు.ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.అజిత్ తో సినిమా అంటే కత్తి మీద సాము లాంటిదట.అజిత్ ను కన్ సల్ట్ చేయడం, రెండు వైపులా డిస్కషన్ చేసి స్టోరీ లాక్ చేయడం వరకు ఓకె.కానీ ఆ తరువాతే అసలు కథ మొదలవుతుందట.

మాములుగా తమిళ హీరోలు ఎవ్వరూ బ్లాక్ మనీ తీసుకోరు.

నూటికి నూరు శాతం వైట్, ప్లస్ జిఎస్టీ.అది నిర్మాతకు మంచిదే.

కానీ అజిత్(Ajith) వ్యవహారం ఇంకోంచెం స్ట్రిక్ట్.సినిమా ఒప్పుకున్నాక టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటారట.

ఒక పది కోట్లు అనుకోవచ్చు.ఆ తరువాత నుంచి ప్రతి నెల అయిదవ తేదీన కచ్చితంగా అజిత్ అకౌంట్ లో 15 కోట్లు జమ కావాల్సిందేనట.

ఆ అయిదో తేదీ కనుక బ్యాంక్ హాలీడే అయితే నాల్గవ తేదీకి పడిపోవాల్సిందేనట.ఇలా షూటింగ్ టైమ్ లో ప్రతి నెల ఇస్తూ పోవాలట.

టోటల్ రెమ్యూనిరేషన్ 160 కోట్లకు కాస్త అటు ఇటుగా వుంటుందట.దీనికి తోడు జిఎస్టీ అదనం.

Telugu Ajith, Ajith Per, Kollywood, Producers, Tamil Ajith-Movie

అంటే దాదాపు పది నెలల పాటు ప్రతి నెల అయిదో తేదీకి 15 కోట్ల వంతున వాయిదాల పద్దతిలో రెమ్యూనిరేషన్ ఇస్తూ పోవాలన్న మాట.అయితే అప్పటికి సినిమా కూడా పూర్తయిపోతుందట.వాయిదా డ‌బ్బులు మాత్రం డేట్ తప్పడం అన్నది అస్సలు అజిక్ నచ్చని విషయం అని తెలుస్తోంది.ఇదిలా వుంటే మైత్రీ సంస్థ అజిత్ తో మరో సినిమా చేయాలని భావిస్తోందట.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మైత్రీ సంస్థకు లాభమేనా అంటే కాస్త బ్రేక్ ఈవెన్ కు దూరంగానే వున్నట్లు తెలుస్తోంది.అందుకే అజిత్ తోనే మరో సినిమా చేయాలని ప్రయత్నిస్తోందట మైత్రీ సంస్థ.

అయితే ఈ సారి రెమ్యూనిరేషన్ లో కాస్త డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతున్నట్లు బోగట్టా.మరి ఈ విషయంపై అజిత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube