ప్రాణాలను పణంగా పెట్టి నటించారు.. అయినా ఈ హీరోలకు నిరాశే ఎదురయింది..?

సాధారణంగా సినిమా హీరోల లైఫ్ చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటాం.హాయిగా కామెడీ చేస్తూ, హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయడమే కాకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తారని భావిస్తాం.

 These Celebs Worked Hard For Movies , Ram Pothineni, These Celebs , N. Lingusa-TeluguStop.com

కానీ రియాలిటీ అందుకు చాలా భిన్నంగా ఉంటుంది.హీరోలు ఫైట్లు, స్టంట్స్ చేయడానికి, డ్యాన్స్ నేర్చుకోవడానికి, డైలాగ్స్ చెప్పడానికి, సరిగ్గా యాక్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

కొంతమంది హీరోలు ఛాలెంజింగ్ రోల్స్ టేకప్ చేసి తమ ప్రాణాలను పణంగా పడతారు.ప్రాణాలకు తెగించిన నటించినా ఒక్కోసారి ఫ్లాప్స్ ఎదురవుతాయి.

అప్పుడు వారికి ఎదురయ్యే బాధ వర్ణనాతీతం.ఇలాంటి బాధను కొంతమంది స్టార్ హీరోలు ఫేస్ చేశారు.వారెవరో తెలుసుకుందాం.

• రామ్ పోతినేని

( Ram Pothineni )

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి( Ram Pothineni ) “ది వారియర్ (2022)” సినిమా షూటింగ్ సమయంలో స్పైనల్ కార్డ్‌కి తీవ్ర గాయమైంది.రామ్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు, జిమ్‌లో కఠినమైన వర్కర్స్ చేశాడు.కానీ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.దీనికి ఎన్.లింగుసామి( N.Lingusamy ) దర్శకుడు.ఈ సినిమా రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా రూ.37 కోట్లు మాత్రమే వసూలు చేసింది.అలానే “స్కంద: ది ఎటాకర్” మూవీ సమయంలో అతడి కాలికి బాగా దెబ్బ తగిలింది.అయినా ఈ మూవీ కోసం కష్టపడ్డాడు.

బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది.రూ.95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.59 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Telugu Akkineni Akhil, Bahubali, Boyapati Srinu, Dear Comrade, Lingusamy, Prabha

• విజయ్ దేవరకొండ

( Vijay Devarakonda )

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” సినిమా( “Dear Comrade” movie ) షూటింగ్ సమయంలో ట్రైన్ పైనుంచి జారి కింద పడ్డాడు.దీనివల్ల అతడి చేతులకు, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి.అయితే పెద్ద ప్రమాదం జరగకుండా అక్కడున్న కొంతమంది విజయ్‌ని కాపాడారు.ఇలాంటి ఇంజురీ అయినా సరే విజయ్ మళ్ళీ తన ప్రాణాలకు తెగించి ఆ ట్రైన్ సీన్‌ కంప్లీట్ చేశాడు.

అయినా ఈ మూవీ అతనికి నిరాశే మిగిల్చింది.

Telugu Akkineni Akhil, Bahubali, Boyapati Srinu, Dear Comrade, Lingusamy, Prabha

• అక్కినేని అఖిల్

( Akkineni Akhil )

అఖిల్ “ఏజెంట్” సినిమా( “Agent” movie ) కోసం ఎంత కష్టపడ్డాడో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.అతను బాడీ బిల్డ్‌ చేయడానికి కఠినమైన వర్కౌట్స్‌ చేశాడు.షూటింగ్ సమయంలో అఖిల్‌కి మాత్రమే కాకుండా డైరెక్టర్ కాళ్లకు కూడా గాయాలయ్యాయి.

వీళ్లు తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి ఈ సినిమా తీశారు.కానీ ఇది డిజాస్టర్ అయ్యింది.ఈ స్పై థ్రిల్లర్ రూ.85 కోట్లు పెట్టి తీస్తే కేవలం రూ.8.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Telugu Akkineni Akhil, Bahubali, Boyapati Srinu, Dear Comrade, Lingusamy, Prabha

• ప్రభాస్

( Prabhas )

ప్రభాస్‌కు బాహుబలి( Bahubali ) సమయంలో మోకాలికి గాయం అయింది.అదే గాయంతో ఆయన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌ సినిమాలు చేశాడు కానీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube