అమెరికా అధ్యక్ష ఎన్నికలు : పోటీ నుంచి తప్పుకోనున్న రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ.. ట్రంప్‌కు జై కొడతారా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి తప్పుకున్నారు.

 Robert F Kennedy Jr To Drop Out Of Us Presidential Race , Robert F Kennedy , Us-TeluguStop.com

వెళ్తూ వెళ్లూ కమలా హారిస్‌కు మద్ధతు తెలపడంతో ఆమె అనూహ్యంగా దూసుకొస్తున్నారు.పార్టీలోని ఒక్కొక్కరు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

డెమొక్రాట్లలో బైడెన్‌తో పాటు పలువురు నేతలు అధ్యక్ష ఎన్నికల నామినేషన్ పొందాలని భావించారు.వీరందరినీ దాటుకుంటూ బైడెన్ ఒక్కరే నిలబడినా , ఆయన చివరికి పోటీ నుంచి వైదొలిగారు.

Telugu Democrats, Republicans, Robert Kennedy, Robertkennedy, Presidential-Telug

ఇదిలాఉండగా.వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్త, పర్యావరణ న్యాయవాది అయిన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ( Robert F Kennedy ) (70) తొలుత డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం జో బైడెన్‌తో పోటీపడి.తర్వాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.పోల్స్ ప్రకారం.బైడెన్‌‌తో పోలిస్తే కెన్నెడీ రాకతో ట్రంప్ విజయావకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయట.ఎందుకంటే ఆయనకు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి పెద్ద ఎత్తున మద్ధతుదారులు వున్నారు.

రాయిటర్స్ సహా ఇతర ప్రముఖ సంస్థల ఓపీనియన్ పోల్స్‌లో కెన్నెడీకి 16 శాతం మద్ధతు వుందని తేలింది.దివంగత సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ కుమారుడే .కెన్నెడీ జూనియర్.1968లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో ఆయన తండ్రి హత్యకు గురయ్యారు.

Telugu Democrats, Republicans, Robert Kennedy, Robertkennedy, Presidential-Telug

ప్రస్తుతం చికాగోలో డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ జరుగుతున్న వేళ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తాను అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపినట్లు అమెరికన్ మీడియా సంస్థలు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ నివేదించింది.ఆయనకు దేశవ్యాప్తంగా 8.7 శాతం మంది ఓటర్ల మద్ధతు ఉన్నట్లుగా తెలుస్తోంది.పోటీ నుంచి తప్పుకుని రిపబ్లికన్ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కెన్నెడీ మద్ధతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో శుక్రవారం అరిజోనా నుంచి దేశ ప్రజనుద్దేశించి ఆయన కీలక ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ట్రంప్‌కు గనుక రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ మద్ధతు పలికితే.స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube