ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం 06.10
రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.20 సా4.40 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీతోబుట్టువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనుల్లో నష్టాలు ఎదురవుతాయి.
మిథునం:

ఈరోజు విద్యార్థులకు చదువు విషయాల్లో విజయం ఉంటుంది.కొన్ని దైవదర్శనాలు చేస్తారు.ఇతరులకు మీరు అప్పుగా ఇచ్చే సొమ్మును తీరుస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.మీకు ధన లాభం కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులుగా మారుతారు.
సింహం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా వేయడంమంచిది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.
కన్య:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.
ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పని చేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.
తులా:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల్లో విజయం ఉంటుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.
దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.మీ వ్యక్తిత్వం వల్ల శత్రువుల మిత్రులుగా అవుతారు.
మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.
మకరం:

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కుంభం:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మీనం:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరంగా ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.