యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బండ్ల గణేష్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి.ఎన్టీఆర్ నటించిన బాద్ షా, టెంపర్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
అయితే టెంపర్ సినిమా రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ కు, బండ్ల గణేష్ కు రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు తలెత్తాయని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.అయితే తాజాగా బండ్ల గణేష్ ఆ వార్తల గురించి స్పష్టతనిచ్చారు.
ప్రస్తుతం బండ్ల గణేష్ ఒకవైపు నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో నటిస్తున్నారు.రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించాలని బండ్ల గణేష్ ప్రయత్నాలు చేసినా పాలిటిక్స్ విషయంలో బండ్ల గణేష్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.
ఆంజనేయులు సినిమాతో బండ్ల గణేష్ నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత పవన్ తో తీన్ మార్ అనే సినిమాను నిర్మించారు.

తీన్ మార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.అయితే దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ పేరు నిర్మాతగా మారుమ్రోగింది.ఎన్టీఆర్ తో గొడవల గురించి స్పందిస్తూ ఎన్టీఆర్ కు, తనకు మధ్య జరిగిన ఒక మిస్ కమ్యూనికేషన్ వల్ల ఆ వార్తలు వచ్చాయని బండ్ల గణేష్ అన్నారు.
అన్నాచెల్లెళ్లు, భార్యభర్తల మధ్య కూడా విభేదాలు తలెత్తుతాయని తనకు, ఎన్టీఆర్ కు మధ్య అదే విధంగా మిస్ కమ్యూనికేషన్ వల్ల చిన్న డిస్కషన్ జరిగిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.