గర్భిణీ మహిళలు పూజలు చేయవచ్చా.. శాస్త్రంలో ఏం ఉంది..

మన భారతదేశ మహిళలకు సాధారణంగానే భగవంతునిపై భక్తి ఎక్కువగా ఉంటుంది.భగవంతుని పూజ కోసం పూలు కోయడం వాటిని మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో వాళ్లు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతూ ఉంటారు.

 Can Pregnant Women Perform Pooja Details, Pregnant Woman, Pooja, Pregnant Woman-TeluguStop.com

అభిషేకాలు, పూజలు చేయడానికి చుట్టుపక్కల వారితో కలిసి స్థానికంగా ఉన్న దేవాలయాల వెళ్తూ ఉంటారు.కార్తిక, శ్రావణ మాసాల్లో మహిళలు మరింత తీరిక లేకుండా పూజలలో బిజీగా ఉంటారు.

మరి అలాంటి యువతులు వారు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయవచ్చా లేదా అనే అనుమానంలో ఉంటారు.అయితే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సలహా ఇవ్వడంతో వారు మరింత కన్ఫ్యుస్ అవుతుంటారు.

ఈ సందేహానికి సమాధానం కూడా మన శాస్త్రంలో ఉంది.గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలని కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదని శాస్త్రం చెబుతోంది.

కొత్త పూజ విధానాలను ఆరంభించడం, పుణ్యక్షేత్రాల దర్శనం వంటివి చేయకూడదని శాస్త్రంలో ఉంది.

గర్భంతో ఉన్న మహిళలు ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రంలో ఉంది.అందువల్ల గర్భవతులు ధ్యానం చేయడం అన్నీ విధాలుగా మంచిది.గర్భవతులకు పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరి ఏ కారణమూ లేదు.

పూజల పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదు అని ఈ నియమాన్ని చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా చెప్పాలంటే పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండలపై ఉంటాయి.అంతేకాకుండా అక్కడ భక్తుల రద్దు ఎక్కువగా ఉంటుంది.అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన గర్భవతులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి ఈ నియమాలను విధించారు.ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.

అది శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇస్తుంది.కనుక ప్రతిరోజు ధ్యానం చేయడమే మంచిదని పండితులు ఆరోగ్యాన్ని పనులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube