మన దేశంలో ప్రజలు ఎన్నో రకాల సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఉన్నారు.మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
దాదాపు ప్రతి గ్రామంలో కచ్చితంగా ఏదో ఒక గుడి ఉంటుంది.వాటిలో కొన్ని దేవాలయాలు ఎంతో ప్రత్యక్షమైనవి.
మహిమ నిత్వ శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు.అలా మహిమలు ఉన్న దేవాలయంలో రతన్‌పూర్ కాలభైరవ దేవాలయం( Ratanpur Kalabhairava Temple ) ఒకటి.
ఛత్తీస్‌గఢ్ లో దుర్గామాతకు( Lord Durga matha ) చెందిన ఒక ప్రఖ్యాతా ఆలయం ఉంది.బిలాస్‌పూర్ జిల్లాలోని రతన్‌పూర్‌లో లో ఈ శక్తిపీఠం( seat of power ) ఉంది.
అయితే ప్రధాన దేవాలయానికి కాస్త ముందు అమ్మవారి రక్షకుడు భైరవనాధ్ ( Bhairavanadh )ప్రవేశద్వారం కూడా ఉంది.ఈ ప్రవేశద్వారం సిద్ధాతంత్ర పీఠం శ్రీ కాల భైరవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
పురాణాల ప్రకారం సతి మాత కుడి భుజం ఇక్కడ పడిపోయింది.అప్పటి నుంచి ఇక్కడ కాలభైరవుడు రక్షకుడిగా ఉన్నాడని స్థానికులు చెబుతూ ఉంటారు.
ఈ కాలభైరవుడిని దర్శించుకుంటే మహామాయ దేవి దర్శనం సంపూర్ణమవుతుందని స్థానికులు చెబుతున్నారు.దేవాలయ ప్రాంగణంలో ఒక చెరువు కూడా ఉంటుంది.
ఇందులో కమల పూలు పెద్ద సంఖ్యలో వికసిస్తూ ఉంటాయి.మహా మాయా దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎవరు వచ్చినా ముందు వారు కాలభైరవన్ని దర్శించుకున్నాకే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే కాలభైరవ విగ్రహం ఇంతకుముందు బహిరంగ వేదికపై ఉండేది.ఆ తర్వాత దేవాలయాన్ని బాబా జ్ఞానగిరి గోసాయి నిర్మించారు.దేవాలయంలో ప్రతిష్టించిన విగ్రహం దాదాపు పది అడుగుల ఎత్తులో ఉగ్రరూపంలో ఉంటుంది.భైరవుని ఈ ఉగ్ర రూపం దుర్మార్గుల సంహారం, భక్తులు రక్షణ కోసం అని భక్తులు విశ్వసిస్తారు.
పూర్వకాలంలో సిద్ధియోగి ఇక్కడ తాంత్రిక సాధన చేసే వారని కూడా స్థానికులు చెబుతున్నారు.కాలభైరవుడితో పాటు మహామాయ దేవిని దర్శించుకుంటే భక్తుల కోరికలు అన్ని నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
కాలభైరవుని దర్శనం తర్వాత శివపార్వతుల అపారమైన అనుగ్రహం లభిస్తుంది.కష్టాలన్నీ తొలగిపోతాయి.
అంతేకాకుండా మంత్ర విద్య, ప్రేతాత్మలు వంటి దోషాలు కూడా దూరమైపోతాయని భక్తులు నమ్ముతారు.
LATEST NEWS - TELUGU