అక్రమ మార్గాల్లో అమెరికాలో ( America ) అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో( US-Canada Border ) నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.
తాజాగా అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తూ ఆరుగురు వ్యక్తులు జలసమాధి అయ్యారు.వీరిలో ఒక భారతీయ కుటుంబం( Indian Family ) కూడా వుంది.వీరి మృతదేహాలను గురువారం కనుగొన్నారు.మృతుల్లో ఐదుగురు పెద్దలు, ఒక చిన్నారి వున్నాడు.
వీరంతా కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.వీరు ప్రయాణిస్తున్న బోటు సెయింట్ లారెన్స్ నదిలో ఒక్కసారిగా తిరగబడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్లు క్యూబెక్ సమీపంలోని మార్ష్ ప్రాంతంలో మృతదేహాలను వెలికితీశారు.
మృతుల్లో భారతీయ కుటుంబంతో పాటు రొమేనియాకు చెందిన కుటుంబం కూడా వున్నట్లుగా తెలుస్తోంది.ఇకపోతే.గతేడాది జనవరిలో అమెరికా – కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
మృతులను జగదీష్ పటేల్, అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు విహంగీ పటేల్, ధార్మిక్ పటేల్‌గా గుర్తించారు.
వీరి మృతదేహాలు విన్నిపెగ్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో వున్న ఎమర్సన్‌కు తూర్పున మంచు కప్పబడిన పొలంలో కనిపించాయి.వీరు గుజరాత్‌లోని కలోల్ తహసీల్‌కు చెందిన వారు.ఆ తర్వాత మార్చి 2022లో కెనడా సరిహద్దుకు సమీపంలో వున్న సెయింట్ రెగిస్ నదిలో పడవ మునిగిన ఘటనలో గుజరాత్‌కు చెందిన ఆరుగురు యువకులను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు.
వీరంతా యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.