ఒకే ఒక్క అవకాశం కోసం అలనాటి స్టార్ యాక్టర్ చిత్తూర్ నాగయ్య ఇంతలా మోసపోయారా..?

ప్రముఖ నటుడు పద్మశ్రీ చిత్తూరు.ఈయన అసలు పేరు వి.నాగయ్య .కళామ్మతల్లీ ముద్దు బిడ్డ.ఈయన నటించిన వేమన సినిమాలో వేమారెడ్డి పాత్ర లో చేసిన నటనకు ఎంతో మంచి గుర్తింపు తో పాటూ అవార్డులు సైతం వరించాయి.అయితే అందరిలాగే ఈయన కూడా నటనమీద ఆసక్తితో చెన్నై బయలుదేరి వెళ్లారు.

 Chittoor Nagaiah Early Life Movie Struggles, Chittoor Nagaiah , Chittoor Nagaiah-TeluguStop.com

అక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు.కొంతమంది చేతిలో మోసానికి కూడా గురయ్యారు.

ఇటీవలే ఆయనకు జరిగిన ఒక మోసం వార్తల్లోకి వచ్చింది.నాగయ్య గారు సినిమాల్లోకి రాకముందే అయన తండ్రి చనిపోయారట.

అయితే అప్పుడు ఆయన పేరు మీద ఉన్న జీవిత బీమా డబ్బులు ఒక పది వేల రూపాయలు వచ్చాయట.అంత డబ్బు నాగయ్య గారి చేతికి రాగానే ఈ డబ్బులతో మనం చెన్నై వెళ్లి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుందామని, అక్కడ నుండే ఇంటికి కూడా కాస్త డబ్బు పంపుతూ ఉండవచ్చు అని బాగా ఆలోచించుకొని ఆ డబ్బుతో మద్రాసు బయల్దేరి వెళ్లారు.

అక్కడకు వెళ్ళాక జార్జి టౌన్‌లో ఉన్నటువంటి సర్దార్‌ భవన్‌ హోటల్లో బస చేశారు.అయితే అప్పుడే ఆయనకు అదే హోటల్లో బస చేస్తున్న రంగస్వామి పిళ్లై అనే ఒక వ్యక్తితో పరిచయమైంది.

అలా పరిచయమైన ఆ రంగస్వామి.తెల్లని బట్టలతో, చేతి నిండా ఉంగరాలతో, ఒక పెద్ద జమీందారుల కనడేవాడట.దాంతో అతి తక్కువ కాలంలోనే నాగయ్య అతనితో బాగా ఫ్రెండ్షిప్ చేసాడు.రంగస్వామి మంచి మాటకారి కావడం.

సిలోన్‌ దేశంలో వ్యాపారం చేస్తుంటానని చెప్పడం.కానీ సినిమాలంటే ఇష్టమని అందుకే మద్రాసు వచ్చాను లాంటి మాయ మాటలు చెప్తూ.

నాగయ్యను మాటల్లో పెట్టాడట.ఇంకా నాకు తెలిసిన ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందని చెప్పి.

దాంట్లోనే త్వరలో ఒక సినిమా నిర్మించబోతున్నానని, అందులో నీక్కొడా అవకాశం ఇస్తానంటూ నాగయ్యకు మాయ మాటలు చెప్పాడట.అవి నమ్మిన నాగయ్య.

రంగస్వామిని ఒకసారి నేషనల్‌ మూవీటోన్‌ స్టూడియోకు తీసుకెళ్లారు.అక్కడ నెల్లూరు నగరాజరావుకి రంగస్వామిని పరిచయం చేశారు.

అప్పుడు రంగస్వామి ఏదైనా మంచి కథ ఉంటె మనం సినిమా చేయొచ్చు అని నగరాజరావుతో చెప్తే.నగరాజరావు వెంటనే ‘నరనారాయణ’ నేపథ్యంలో సినిమా నిర్మిస్తే మంచి విజయం సాధిస్తుందని సలహా ఇచ్చాడు.

Telugu Chittoornagaiah-Telugu Stop Exclusive Top Stories

అయితే ఆ కథతోనే సినిమా తీద్దాం అని.కాకపోతే నా దగ్గరున్న డబ్బులు కొన్ని కోర్టు వ్యవహారాల్లో ఖర్చై పోయిందని నాగయ్యతో రంగస్వామి పిళ్లై చెప్పాడట.అయితే అతన్ని పూర్తిగా నమ్మిన నాగయ్య వెంటనే తన దగ్గర పదివేలరూపాయలు ఉన్నాయని దానితో ఆఫీస్ తీసుకుందామని చెప్పి ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.అలా ఒక వారం గడిచాక రంగస్వామి కొలంబో వెళ్లాలని అక్కడికి వెళ్లి ఒక లక్ష రూపాయలు పంపుతానని చెప్పి నాగయ్య దగ్గరున్న మిగతా 6 వేల రూపాయలు కూడా తీసుకొని వెళ్లిపోయాడు.

ఇక అంతే ఆ తర్వాత రంగస్వామి దగ్గర నుండి ఒక్క ఉత్తరం కానీ, ఒక కబురు కానీ రాలేదు.ఇక్కడ ఆఫీస్ లో మాత్రం నాగయ్య నగరాజరావుతో కలిసి ఆఫీసులో స్క్రిప్టు పనులు చూసుకుంటున్నారు.

నెలరోజులు గడిచింది.రంగస్వామి పిళ్లై నుంచి ఏ కబురు లేదు.

అలా ఒకరోజు నాగయ్య మర్కాంటైల్‌ బ్యాంకుకు వెళ్ళి ఏదైనా డ్రాఫ్టు వచ్చిందేమో కనుక్కున్నారు.అయితే బ్యాంకు వారు నవ్వి, రంగస్వామి ఎవరు, డ్రాఫ్టు ఇక్కడకు ఎలా వస్తుంది.

నిన్ను ఎవరో మోసం చేసారు అని చెప్పడంతో నాగయ్య కంగుతిన్నాడు.చివరకు ఆ రంగస్వామి ఘరానా మోసగాడని అర్ధంచేసుకుని వెంటనే దివాన్‌ బహదూర్‌ రంగనాథం గారిని కలిసి గోడు విన్నవించుకున్నాడు.

ఇక చేసేదేమిలేక అంతవరకూ అయిన అద్దె చెల్లించనవసరం లేదని, బంగళా ఖాళీ చెయ్యవలసిందని చెప్పడంతో నాగయ్య కొంత ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విదంగా దాచుకున్న కాస్త సొమ్ములని కోల్పోయి నుంగంబక్కమ్‌లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉండవలసిన దుస్థితి ఆయనకు వచ్చింది.

ఖాళి కడుపును ఎన్నో సార్లు మంచి నీళ్లతో నింపుకునేవారు.ఇంకా ఒక అణా జేబులో వుంటే దానితో శనక్కాయలు కొనుక్కొని ఆకలి తీర్చుకున్నారట.అయితే ఎన్ని కష్టాలు వచ్చిన నాగయ్య మాత్రం తిరిగి ఇంటికి పోలేదట.ఎలాగైనా సినిమాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో డైరెక్టర్ బి.ఎన్‌.రెడ్డితో పరిచయం అవ్వడం ఆ తరువాత వరుసగా సినిమాలలో అవకాశాలు రావడం దాని ద్వారా బాగా డబ్బు సంపాదించడం జరిగింది.

అయితే నాగయ్య గారు చిన్నప్పటి నుండే మహా దయశాలి అతన్ని ఎవరైనా ఏమైనా అడిగితే కాదనుకుండా ఉన్నదాంట్లో సహాయం చేస్తాడట.అలా సినిమాల్లో అయన సంపాదించిన డబ్బుని దాచుకోకుండా.

దానాలు చేయడం, విరాళాలు ఇవ్వడం, చేసేవారట.ఇంకా మంచి వాళ్ళని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు కదా.దాంతో కొంతమంది దగ్గర నాగయ్య గారు మళ్ళీ మళ్ళీ మోసపోయి ఆస్తులు అన్ని పోగొట్టుకున్న విషయం మనందరికి తెలిసిందే.అలా ఆయన 30 ఏళ్ల సినిమా జీవితంలో అందరిచేతా ‘నాన్నగారూ’ అనిపించుకోవడం తప్పా పెద్దగా సంపాదించింది ఏమి లేదట!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube