వాస్తవానికి ఇండియన్ రైల్వే( Indian Railways ) ప్రయాణికుల సౌకర్యం కోసం అందించే కొన్ని సదుపాయాలు చాలా మందికి తెలియకపోవడం ఆశ్చర్యకరం.నిజానికి, రిజర్వేషన్ ఉన్న టికెట్( Reservation Ticket ) ఉన్న ప్రయాణికుల కోసం ఉచిత సదుపాయాలు అందించడం అనేది రైల్వే సర్వీసుల నాణ్యతను పెంచడం, ప్రయాణికుల విశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం రైల్వే తీసుకున్న ఒక చక్కటి నిర్ణయం అనే చెప్పాలి.
రైలు ఆలస్యమైన సందర్భాల్లో ఉచిత భోజనం( Free Meal ) అందించడం, అలాగే కేటరింగ్ సర్వీస్ ద్వారా మంచి ఆహారాన్ని ఉచితంగా ఆర్డర్ చేసే అవకాశం వినూత్నమైనదే.ఇది ప్రయాణికులలో నిరాశను తగ్గించి, వారికి మెరుగైన అనుభవాన్ని అందించడంలో కీలకంగా ఉంటుంది.
నిజానికి ఇండియన్ రైల్వే అందించే ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.కానీ చాలా మందికి తెలియకపోవడం వల్ల వీటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు.మరి ఆ సేవలు ఏమిటంటే.
ఇందులో మొదటిది ఉచిత బెడ్‌షిట్.( Free Bedsheet ) AC1, AC2, AC3 కోచ్‌లలో ఈ సదుపాయం నిజంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం.దుప్పటి, దిండు, బెడ్‌షీట్లు అన్నీ అందిస్తారని చాలా మందికి తెలుసు.
కానీ, టవల్ కూడా అందించబడుతుందని తెలుసుకోవడం కొత్త విషయమే.ఇది ప్రయాణికులకు హైజీన్ పరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే ఈ లిస్టులో ఉచిత వైద్య సేవలు( Free Medical Services ) కూడా ఉన్నాయి.రైలులో ప్రయాణించే వారి ఆరోగ్యంపై ఈ విధంగా దృష్టి పెట్టడం అనేది భారతీయ రైల్వే మంచి ఆలోచన.
చిన్నపాటి ఆరోగ్య సమస్యలకైనా టీటీ ద్వారా మందులు అందించడం, అత్యవసర పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో సహాయ పడుతుంది.ఇది ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాల్లో ప్రయాణికులకు భరోసా కలిగిస్తుంది.
అలాగే ఈ లిస్టులో మీరు రిజర్వేషన్ చేసిన టికెట్‌తో రైలు ఆలస్యం అయినప్పుడు ఉచితంగా వెయిటింగ్ హాల్‌లో ఉండే అవకాశం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.ఇది ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయబడిన ఒక మంచి ఆలోచన.గది శుభ్రంగా ఉండటమే కాకుండా, ప్యాసింజర్ల కోసం ఒక బ్రేక్ ఇచ్చే ఏర్పాటుగా ఉపయోగపడుతుంది.అంతే కాకుండా క్లోక్ రూమ్ సదుపాయం ప్రయాణికులకు చాలా అవసరమైన సదుపాయం.మీరు మీ లగేజీని ఉంచి స్టేషన్ పరిసర ప్రాంతాలు సందర్శించవచ్చు.1 నెల పాటు గరిష్టంగా వస్తువులను భద్రపరిచే అవకాశం ఉపయోగకరమే కానీ.ఈ సర్వీస్ కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.అయితే, టికెట్ ఉన్న ప్రయాణికులకు రాయితీ అందించడం ప్రయాణికుల ఖర్చును తగ్గిస్తుంది.