ఆ నటుడికి 2 లక్షలు సహాయం చేసిన పవన్.. మనిషి రూపంలో ఉన్న దేవుడంటూ?

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ( Fish Venkat )రెండు కిడ్నీలు చెడిపోయి న‌డవలేని దయనీయ స్థితిలో ఉన్న విష‌యం తెలిసిందే.ప్రస్తుతం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు వెంకట్.

 Fish Venkat Comments On Pawan Kalyan, Fish Venkat, Tollywood, Health Condition,-TeluguStop.com

ఇప్పటికే చాలామంది ఆయనకు ఆర్థికంగా సహాయం చేసినట్లు వార్తలు వినిపించాయి.ఒక యూట్యూబ్ ఛానల్( YouTube channel ) ఆయనను ఇంటర్వ్యూ చేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది.

త‌న రెండు కిడ్నీలు ఫెయిల్ ( Both kidneys fail )కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కొన్ని నెల‌ల క్రితం ఒక ఇంట‌ర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Telugu Fish Venkat, Fishvenkat, Pawan Kalyan, Tollywood-Movie

అయితే వెంక‌ట్ ప‌రిస్థితి తెలుసుకున్న సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఆయ‌న‌కు ఆర్థిక స‌హాయం అందించిన విష‌యం తెలిసిందే.ఇదిలావుంటే తాజాగా ఆయ‌న ప‌రిస్థితి తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan )రూ.2 ల‌క్ష‌లు పంపించిన‌ట్లు ఒక వీడియోలో చెప్పుకోచ్చారు.నేను మీ ఫిష్ వెంక‌ట్.ఇప్పుడు నా ఆరోగ్య ప‌రిస్థితి అస‌లు బాగ‌లేదు.షూగ‌ర్‌, బీపీల‌తో బాధప‌డుతున్నాను.అలాగే నా రెండు రెండు కిడ్నీలు చెడిపోయి న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నాను.

ప్ర‌స్తుతం డయాల్సిసిస్ జ‌రుగుతుంది.అయితే ఇంట్లో వాళ్లంద‌రూ నీకు అగ్ర న‌టులు అంద‌రూ తెలుసు క‌దా వారిని క‌లిసి నీ పరిస్థితికి గురించి చెప్ప‌వ‌చ్చు కదా అని అడుగుతున్నారు.

Telugu Fish Venkat, Fishvenkat, Pawan Kalyan, Tollywood-Movie

కానీ నేను ఇప్పటివ‌ర‌కు ఏ హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌లేదు. షూటింగ్‌ లో వెళ్లి క‌ల‌వ‌డం త‌ప్పా ఇలా క‌ల‌వ‌లేను. అయితే నా పరిస్థితి ఇలా అయ్యాక వెళ్లి క‌లుద్దామ‌నుకున్నాను.కానీ వెళ్లే ప‌రిస్థితి లేదు.నా భార్య న‌న్ను అడుగుతూ.ప‌వ‌న్ స‌ర్‌ని వెళ్లి క‌ల‌వండి అని చెప్పింది.

అత‌డిని క‌లిస్తే.మీకు ట్రీట్‌మెంట్ చేయిస్తాడు.

అంటూ ఒత్తిడి చేయ‌డంతో వెళ్లి ప‌వ‌న్‌ కళ్యాణ్ ని క‌లిశాను.అత‌డికి నా పరిస్థితి ఇలా ఉంద‌ని చెప్పాను.

వెంట‌నే ఆయ‌న స్పందించి నాకు చికిత్స అందించారు.అలాగే నా ఆర్థిక ప‌రిస్థితి బాగ‌లేద‌ని చెప్ప‌డంతో రూ.2 ల‌క్ష‌ల రూపాయ‌లు నా బ్యాంక్ అకౌంట్‌ లో డిపాజిట్ చేయించారు.ఆయ‌న‌కు నా పాదాభివందనాలు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ ఆయ‌న్ కుటుంబం బాగుండాల‌ని ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామివారిని వేడుకుంటున్నా అంటూ ఫిష్ వెంక‌ట్‌ ఎమోష‌న‌ల్ అయ్యారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube