అధిక బరువు.ఇటీవల కాలంలో కోట్లాది మందికి ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది.
బరువు పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు శరీరకంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి.దానికి తోడు మన శరీర ఆకృతిపై ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్లు మానసికంగా కూడా కృంగదీస్తాయి.
ఈ క్రమంలోనే ఎలాగైనా బరువు తగ్గాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.కొందరైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, అంత వరకు వెళ్లాల్సిన అవసరం లేదు.సరైన పద్ధతులను పాటిస్తే చాలా సులభంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబొయే స్మూతీని డైలీ డైట్‌లో చేర్చుకుంటే అధిక బరువు నుంచి కీళ్ల నొప్పుల వరకు అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అర గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఇలా ఉడికించుకున్న ముక్కలను పూర్తిగా చల్లారిన తరువాత బ్లెండర్ లో వేసుకోవాలి.
అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఐదు నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, చిటికెడు ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఒకటిన్నర గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్ధం అయినట్లే.

ఈ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే.అతి ఆకలి దూరం అవుతుంది.మెటబాలిజం రేటు పెరుగుతుంది.
దాంతో వేగంగా బరువు తగ్గుతారు.అదే సమయంలో ఈ స్మూతీని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
గుండె పని తీరు మెరుగుపడుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
మూత్రాశయ సమస్యలు ఏమైనా ఉంటే.వాటి నుంచి విముక్తి పొందుతారు.
కొన్నిరకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.