రోజుకు అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుంది..తెలుసా?

పురాతన కాలం నుంచి వాడుతున్న నూనెల్లో ఆవిల్ నూనె ఒక‌టి.ఆలివ్ పండ్ల నుంచి ఆలివ్ ఆయిల్ ను త‌యారు చేస్తారు.

 Half A Teaspoon Of Olive Oil Per Day Increases Life Span, Olive Oil, Life Span,-TeluguStop.com

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాల‌న్నా.చ‌ర్మ సౌంద‌ర్యం రెట్టింపు అవ్వాల‌న్నా.

కురులు ఒత్తుగా, పొడ‌వుగా పెర‌గాల‌న్నా ఆయిల్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కానీ, చాలా మందికి ఆలివ్ ఆయిల్ గురించి అవ‌గాహ‌న లేక‌.

దాని వైపు కూడా చూడ‌టం లేదు.నిజం చెప్పాలంటే రోజుకు అర స్పూన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకుంటే మ‌న ఆయుష్షు పెరుగుతుంద‌ట‌.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.తాజా అధ్యయనంలో తేలిన విష‌యం ఇది. ఆలివ్ ఆయిల్ లో ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.అవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.

రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ ను డైరెక్ట్‌గానో, స‌లాడ్స్ ద్వారానో లేదా ఇత‌రిత‌ర విధాల‌గానో తీసుకుంటే.బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ ల‌భిస్తాయి.

ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను క‌రిగించి గుండె ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో సూప‌ర్ గా హెల్ప్ చేస్తుంది.అలాగే ఆలివ్ ఆయిల్ ను డైలీ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

మెద‌డు మునుప‌టి కంటే చురుగ్గా ప‌ని చేస్తుంది.శరీరంలో వృద్ధి చెందుతున్న క్యాన్సర్ క‌ణాల పెరుగుదలను అడ్డుకునే శ‌క్తి ఆలివ్ ఆయిల్ కు ఉంది.

Telugu Tips, Latest, Span, Olive Oil-Telugu Health Tips

అందువ‌ల్ల రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.అంతేకాదు, ఆలివ్ ఆయిల్‌ను రోజువారీ వంటల్లో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల‌.వెయిట్ లాస్ అవుతారు.మ‌ధుమేహం అదుపులో ఉంటుంది.జలబు, ద‌గ్గు వంటి సీజ‌న‌ల్ వ్యాధులు సైతం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube