నిర్జల ఏకాదశి( Nirjala Ekadashi ) రోజు వ్రతం చేయిస్తారు.దాదాపు చాలామంది ప్రజలు ఉపవాసాన్ని( Fasting ) పాటిస్తారు.
పచన ప్రయత్నం చేయకూడదు.అంటే ఆ సమయంలో రేపటి తిండి గురించో లేక రేపటి ఆహారం వండుకునేందుకు అవసరమైన పదార్థాల గురించి ఆలోచించకూడదు.
అసలు శరీర పోషణకు కావలసిన ఏ పని చేయకూడదు అని ఈ పండితులు చెబుతున్నారు.ఇక నిర్జల ఏకాదశి రోజు నీరు తాగకూడదు.ఉమ్ము మింగా కూడదు.
అయితే చాలామందికి చివరి రోజుల్లో నీరు ఇవ్వరు, అన్నం పెట్టారు.
ఆసుపత్రిలో గొట్టం ద్వారా వెళ్లేదే ఆహారం.ఆహారమే తినలేడు, తాగలేడు, బయటకు వెళ్లలేడు.
తింటే తప్ప నిద్ర పట్టని అలవాటు ఈ రోజుల్లో దాదాపు చాలా మందికి ఉంది.ప్రతిపక్షంలోనూ ఏకాదశి వ్రత ఉపవాస దీక్ష చేస్తే అది అలవాటైపోతుంది.
ఈశ్వరుడినే స్మరిస్తూ ఉండడం అలవాటైపోతుంది.ఇంకా చెప్పాలంటే చివరి రోజు వచ్చినప్పుడు చివరి శ్వాసలోనూ ఈశ్వరుడి స్మరణ ఉంటుంది.

ఏకాదశి వ్రతానికి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మృత్యువు వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడమే అని పండితులు చెబుతున్నారు.8 సంవత్సరాల లోపు పిల్లలు అలాగే వయసు పైబడిన వృద్ధులు ఈ ఉపవాసం పాటించకూడదు.అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఉపవాసానికి దూరంగా ఉండాలి.ధర్మ, అర్ధ, కామ మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులకు వేద వ్యాస మహర్షి బోధించారు.
ఇప్పుడు మాతా కుంతీ, ద్రౌపదితో సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు.కానీ ఆకలికి తట్టుకోవాలని భీముడు నెలలో రెండు రోజులు ఉపవాసం ఉండడం చాలా కష్టమని భావిస్తాడు.

వ్యాస మహర్షిని( Vyasa Maharshi ) పరిష్కారం కోరుతాడు.దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి చెబుతాడు.ఈ ఒక్క ఉపవాసం చేస్తే సంవత్సరం పొడుగునా మిగిలిన అన్ని ఏకాదశి లకు ఉపవాసం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని ఉపదేశిస్తాడు.జ్యేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని నీళ్ళు కూడా త్రాగకూడదని సూచిస్తాడు.
సూర్యోదయం నుంచి మరునాటి రోజు సూర్యోదయం వరకు ఇలా కఠోర ఉపవాస దీక్ష ఉండాలని సూచిస్తాడు.ఆ తర్వాత స్నానమాచరించి దానధర్మాలు చేయాలి.ఆ తర్వాత స్వయంగా శ్రీ విష్ణుమూర్తిని పూజించాలని సూచిస్తాడు.
DEVOTIONAL