సినీనటి హేమ( Hema ) ప్రస్తుతం రేవ్ పార్టీ( Rev Party ) కేసులో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ మిగతా ఏడాది మే నెలలో బెంగళూరులోని ఒక పార్టీకి హాజరయ్యారు.
అయితే తనకు తెలిసినవారు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమె ఆ పార్టీకి హాజరయ్యారు.ఇక ఈ పార్టీలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నారనే విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు వెంటనే ఆ ఫామ్ హౌస్ పై అటాక్ చేశారు.
ఇక ఆ పార్టీలో పాల్గొన్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే నటి హేమ సైతం ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నారని తెలుస్తుంది.
ఇలా హేమ రేవ్ పార్టీలో దొరికారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె వెంటనే స్పందిస్తూ తాను హైదరాబాదులోని తన ఫామ్ హౌస్ లోనే ఉన్నానని ఒక వీడియోని విడుదల చేశారు అయితే ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తనని అరెస్టు చేసినటువంటి ఒక వీడియోని విడుదల చేశారు.అందులో ఈమె మొహం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.అదే విధంగా తనకు డ్రగ్స్ టెస్ట్ ( Drugs Test ) కూడా చేయించారు.ఈ పరీక్షలలో నటి హేమకు పాజిటివ్ రావడంతో కేసు మరింత బలపడింది.
ఈ క్రమంలోని విచారణకు రావాలి అంటూ పలు సందర్భాలలో పోలీసులు ఈమెకు నోటీసులు అందజేసిన ఈమె మాత్రం విచారణకు రాలేదు.దీంతో పోలీసులు బలవంతంగా ఈమెను అరెస్టు చేసే రిమాండ్ కు తరలించారు ఇలా 14 రోజులపాటు జైల్లో ఉన్న ఈమె బయటకు వచ్చారు.అనంతరం తనని అక్రమంగా అరెస్టు చేశారు అంటూ పోలీసులపేరు అలాగే మీడియా వారి ధోరణిపై కూడా ఈమె పెద్ద ఎత్తున మండిపడ్డారు.తాజాగా ఈ కేసు విషయంలో హేమకు బిగ్ రిలీఫ్ దొరికిందని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈమె బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ తరచూ విచారణకు హాజరవుతుంది.ఈ క్రమంలోనే హేమ పోలీస్ విచారణ నిలిపివేయాలి అంటూ కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇలా తన విచారణను నిలిపివేసినప్పటికీ కోర్టులో కేసు మాత్రం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు.