రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేసిన చిరంజీవి.. సీనియర్ హీరోల్లో ఈ హీరోదే రికార్డ్!

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన చిరంజీవికి( Chiranjeevi ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.చిరంజీవి సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంటే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సులువుగానే వస్తాయని వాల్తేరు వీరయ్య మూవీ ప్రూవ్ చేసింది.

 Star Hero Chiranjeevi Remuneration Hike Details, Chiranjeevi, Megastar Chiranjee-TeluguStop.com

ఆచార్య, భోళా శంకర్ సినిమాలు నిరాశ పరిచినా చిరంజీవి క్రేజ్ మాత్రం అణువంతైనా తగ్గలేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

అయితే స్టార్ హీరో చిరంజీవి తన రెమ్యునరేషన్ ను( Chiranjeevi Remuneration ) మళ్లీ పెంచేశారు.

విశ్వంభర సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ కోసం ఏకంగా 75 కోట్ల రూపాయల రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.చిరంజీవి శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం మెగాస్టార్ ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Telugu Chiranjeevi, Nani, Srikanth Odela-Movie

సీనియర్ హీరోలలో రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవిదే రికార్డ్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇతర స్టార్ హీరోలు తమ జీవిత కాలంలో ఈ మార్క్ ను అందుకోవడం కష్టమనే చర్చ జరుగుతోంది.చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ తో మరిన్ని రికార్డ్స్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Chiranjeevi, Nani, Srikanth Odela-Movie

చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని( Nani ) సినిమాతో బిజీగా ఉన్నారు.చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబో సెన్సేషనల్ కాంబో అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.కథ నచ్చితే చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube