సాధారణంగా కొందరి జుట్టు( hair ) చాలా పల్చగా ఉంటుంది.ఇలాంటి వారికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ పెద్దగా సెట్ అవ్వవు.
ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. ఖరీదైన హెయిర్ ఆయిల్స్( Expensive hair oils ) ను యూస్ చేస్తారు.
అయినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉందా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోటీన్ మాస్క్ ను ప్రయత్నిస్తే మీ కురులు డబుల్ అవడం గ్యారెంటీ.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కలబంద ఆకును ( Aloe vera leaf )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.మిక్సీ జార్ లో ఈ జెల్ ను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అలోవెరా జెల్ లో ఒక ఎగ్ వైట్ ( Egg white )మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె( Mustard oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ ప్రోటీన్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
కురులు ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభమవుతుంది.అలాగే ఈ ప్రోటీన్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
కురులు దృఢంగా మారతాయి.హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.
మరియు ఈ ప్రోటీన్ మాస్క్ కురులతో పాటు స్కాల్ప్ ఆరోగ్యాన్ని పోషిస్తుంది.చుండ్రు సమస్యను దూరం చేసి స్కాల్ప్ ను హైడ్రేట్ గా ఉంచుతుంది.