ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.05
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: షష్టి సామాన్యము సా6.58 ల7.20
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయాలి.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు.
వృషభం:
ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఏవైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీరు చేసిన కొన్ని పనుల వల్ల కుటుంబ సభ్యులు ఆనందిస్తారు.ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచన చేయాలి.
మిథునం:
ఈరోజు మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.అనవసరంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొత్త పనులు మొదలు పెడతారు.
కర్కాటకం:
ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
సింహం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారం మొదలు పెట్టే వాళ్లకు మంచి విజయం ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.పెద్దవారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తుల:
ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి.ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి.
ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.
వృశ్చికం:
ఈరోజు ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.స్ధిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆర్థికంగా సమస్యలు తప్పవు.కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు.ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.
ధనుస్సు:
ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.పాత ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు.
మకరం:
ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి.ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.
కుంభం:
ఈరోజు ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది.విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.
ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.
మీనం:
ఈరోజు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది.ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది.చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.