రాజన్న సిరిసిల్ల జిల్లా శనివారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలో పలు సందర్భాల్లో స్వాధీన పరుచుకున్న/రోడ్ల మీద వదిలేసిన వాహనాలు మొత్తం 54 వాహనాలు వేలంపాట నిర్వహించగా,ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు మొత్తం 5,36,000/- రూపాయలు మరియు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో సర్వీస్ లో లేని కిట్ ఆర్టికల్స్, పాతబడిన టెంట్లు, ఇనుప సామాగ్రి,జెనరేటర్, స్టోర్ మొదలగు వసువులను వేలంపాట నిర్వహించగా,
ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు మొత్తం 1,54,100/- రూపాయల మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు….60 కి పైగా కొనుగోలుదారులు ఈ వేలం పాటలో పాల్గొన్నారు.ఈ వేలం పాటలో అదనపు ఎస్పీ చంద్రయ్య ,స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ,ఆర్.ఐ లు మధుకర్, రమేష్ ,ఆర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.