అన్నదాతల ఆర్ధిక అభివృద్ధికి సహకార సంఘం కృషి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట సంఘ కార్యాలయం నందు అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి చేతుల మీదిగా దీర్గకాళిక రుణాలకు సంబందించిన 5గురు రైతులకు గాను 22,00,000/- లక్షల రూపాయలను, నారాయణపూర్, బొప్పాపూర్, సింగారం, చెందిన రైతులకు చెక్కులను అందజేశారు.వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణి చేస్తామని అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలిపారు.

 Cooperative Society Efforts For Economic Development Of Rice Farmers, Cooperativ-TeluguStop.com

రైతులు ఆర్ధిక స్వావలంబన సాదించాలంటే వ్యవసాయంతో పాటు దాని అనుబంద రుణాలు అయిన డైరీ, గొర్రెలు, పట్టు పురుగులు, కోళ్ళపెంపకం, బోరు మోటార్ పైప్ లైన్, ల్యాండ్ డేవలప్మెంట్, కర్శకమిత్ర, ట్రాక్టర్, హర్వేస్టర్ లకు సహకార సంఘాలకు ఇచ్చే ధీర్గకాలిక రుణాలు వాడుకొని ముందుకు సాగాలని వారు కోరారు.ఈ కార్యక్రమములోసంఘ వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు కోనేటి ఎల్లయ్య, నెవూరి వెంకట నరసింహారెడ్డి, కస్తూరి రామచంద్ర రెడ్డి, ల్యాగల సతీష్, గోగురి ప్రభాకర్ రెడ్డి, గండ్ర ప్రభాకర్ రావు, కనకట్ల సుధాకర్, రైతులు సంఘ సెక్రటరీ కిషోర్ కుమార్, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube