రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్ ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయని అలాగే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్డు పై వెళ్లే ప్రతి ఒక్క వాహనదారుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నారు.
మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని,కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపరాదని,మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లు డ్రైవింగ్ చట్టరీత్య నేరం అన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని.పోలీస్ స్టేషన్ నుంచి ఫ్లెక్సీ పట్టుకొని ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై రమాకాంత్,పోలీస్ సిబ్బంది, విద్యార్థులు,టీచర్లు తదితరులు పాల్గొన్నారు.