రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి,మర్ల పేట కు, విలాసాగర్ గ్రామాల కు వెళ్లే రహదారి మధ్యలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అలాగే మండల కేంద్రం నుంచి విలాసాగర్ వరకు రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిన సందర్భంలో నూతన డాంబర్ రోడ్డు నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని, అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని మాదిరిగా ఈ బోయిన్పల్లి మండలంలో రోడ్ల పరిస్థితి చూసుకుంటే పాలకుల నిర్లక్ష్యం, అవినీతిమయమో తెలియదు గాని ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి.
ఇప్పటికైనా చొప్పదండి ఎమ్మెల్యే బోయిన్పల్లి మండలం లో ఉన్న రోడ్లమీద దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉందని, ప్రజల సేవలను గుర్తు పెట్టుకొని, మరికొద్ది రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంలో దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ కన్వీనర్, గురుజాల శ్రీధర్ ఒక ప్రకటన లో తెలిపారు.