రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వం నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన ఇంటింట సమగ్ర కుటుంబ కులగణన సర్వే నివేదికలో డోర్ లాక్ వలన , ఇతరత్ర పనుల వలన ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో పాటు కొంత మంది వివరాలు తెలుపుటకు నిరాకరించడం వలన (3.1శాతం) సుమారు 16 లక్షల జనాభ వివరాలు సర్వేలో నమోదు కాలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని రాజన్న సిరిసిల్లా జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ అన్నారు.
సర్వేలో నమోదు కానీ కుటుంబాల వివరాలను సేకరించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వ తేది వరకు రీసర్వే చేయుటకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రీసర్వేను ప్రారంభించడం జరిగిందని నరేందర్ అన్నారు.
ప్రభుత్వం విధించిన రీ సర్వే గడువు నేటితో ముగియు చుండెను.
డోర్ లాక్ వలన,వలస వలన తప్పిపోయిన కుటుంబాలతో పాటుగా,రోడ్డు ప్రక్కన గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారి కుటుంబాల వివరాలను మరియు సంచార జాతుల వారి వివరాలను సే కరించుటకు ప్రభుత్వం విధించిన గడువు ఈ రోజుతో సరిపోనందున ,మరొక 15 రోజులు గడువును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పొలాస నరేందర్ కోరారు.బీసీ కుటుంబాలు రీ సర్వేలో నమోదు చేసుకొనుటకు గాను బీసీ సాధికారిత సంఘం నేతలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.