10 శాతం యారన్ సబ్సిడీ తగ్గింపు విధానం ప్రభుత్వం మానుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District): టెక్స్ టైల్ పార్క్ లోని క్యాంటీన్ వద్ద పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించుకొని ఈ సమావేశంలో టెక్స్ టైల్ పార్క్( Tex Tile Park ) లో 2022 – 2023 సంవత్సరాలలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు రావలసిన 10 శాతం యారన్ సబ్సిడీ తగ్గింపు చేసిన విషయంపై చర్చించి యారన్ సబ్సిడీ డబ్బులు తగ్గించకుండా గతంలో ఇచ్చిన బాధ్యత గాని యధావిధిగా ప్రభుత్వం అందించే విధంగా రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని లేకుంటే కార్మికులందరితో హైదరాబాదులోని చేనేత జౌళి శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి స్తామని నిర్ణయం చేశారు.

 Government Should Avoid 10 Percent Yarn Subsidy Reduction Policy , Rajanna Sir-TeluguStop.com

ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ( KODAM Ramana) మాట్లాడుతూ బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీ అందించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం,చేనేత జౌళి శాఖ డైరెక్టర్ గతంలో ఇచ్చిన మాదిరిగా మీటర్ కు 1- 42 పైసలు కాకుండా చెల్లించిన కూలి , పొందిన వేతనం మీద 20% సబ్సిడీ డబ్బులు అందించడం జరుగుతుందని దీనివల్ల టెక్స్ టైల్ పార్క్ లో గతంలో వచ్చిన దానికంటే నాలుగు వంతులు తక్కువ డబ్బులు కార్మికులకు వచ్చే అవకాశం ఉందని దీనివల్ల ఒక్కో కార్మికుడు వేలాది రూపాయలను నష్టపోవడం జరుగుతుందన్నారు.

కార్మికులకు నష్టం జరిగే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం,అధికారులు వెంటనే వెనక్కి తీసుకొని గతంలో మాదిరిగా యధావిధిగా రెండు మూడు రోజుల్లొ కార్మికులకు సబ్సిడీ అందించాలని లేకుంటే కార్మికులందరితో చలో హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అక్కల శ్రీనివాస్ ( Akkala Srinivas ), జెల్ల సదానందం ,అడెపు శుభశేకర్,రాజమల్లు,శ్రీనివాస్, రవి, నరేష్, శ్రీకాంత్ ,వెంకటేష్, సంపత్,ఆంజనేయులు, రాజశేఖర్,రమేష్,రాజు, శంకర్, అంబదాస్ టెక్స్ టైల్ పార్క్ కార్మికులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube