ఎల్లారెడ్డి పేటలో డ్రై డే నిర్వహించిన సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఫ్రై డే డ్రై డే సందర్భంగా గ్రామంలోని పలు వార్డులలో డ్రై డే నిర్వహించారు.మురికి నీటి గుంతలలో నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేశారు.

 The Crew Organized A Dry Day In Yellareddypet, Dry Day ,yellareddypet, Yellared-TeluguStop.com

పలువురి ఇండ్లలో చాలా రోజుల నుండి నీరు నిల్వ ఉన్న డ్రమ్ములు గుర్తించి వాటిని కింద పడ వేశారు.వర్షాకాలం దృష్ట్యా నిల్వ ఉన్న నీటిని వాడుకోవద్దని నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు అభివృద్ధి చెంది

డెంగ్యూ,మలేరియా ప్రబ లుతుందని ఇట్లాంటి వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పలు వార్డుల ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, వైద్య సిబ్బంది శారద,లక్ష్మి, ఐ కే పి సి ఎ పంతులురి వాణిశ్రీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఆంజనేయులు,గంగయ్య లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube