ప్రభుత్వ పాఠశాలల సమస్యల కొరకు కదిలిన ఏబీవీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుంటే ఆమరణ నిరహార దీక్ష చేస్తామని ఏబీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారవేని రంజిత్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

 Abvp Moved For The Problems Of Government Schools, Abvp , Government Schools, Ra-TeluguStop.com

ఈ సందర్భంగా రంజిత్ మట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు .రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని ఎన్ని సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపల్లి చెరువు తండా ప్రభుత్వ పాఠశాలలో అసలు ఉపాధ్యాయులే లేరనీ, ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్ హై స్కూల్ లో 455 విద్యార్థులు ఉంటే 12 మంది ఉపాధ్యయులు మాత్రమే ఉన్నారనీ,కొన్ని సబ్జెక్టు లకు టీచర్లు లేని దుస్థితి ఏర్పడిందన్నారు.

ప్రైమరీ స్కూల్ లో 180 మంది విద్యార్థులు ఉంటే కేవలం 3 టీచర్లు మాత్రమే ఉన్నారనీ, రాచర్ల గొల్లపల్లి అంబేద్కర్ నగర్ లోని ప్రైమరీ పాఠశాల లో 75 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ మాత్రమే ఉన్నారనీ దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆయన ఆరోపించారు.

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇంకా చాలా పాఠశాలల్లో ఇదే దుస్థితి ఉందన్నారు.విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారనీ,అనేక పాఠశాలల భవనాలు శిథిలావస్థ లో ఉన్నాయన్నారు.

కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు తరగతి గదులు సరిపోక చెట్ల కిందనే చదువుకుంటున్న దుస్థితి కళ్ళారా చూస్తున్నామని అన్నారు.ప్రభుత్వ పాఠశాల లో స్విపర్ లేక.విద్యార్థులు, ఉపాధ్యాయులే చీపుర్లు పట్టుకొని ఉడుస్తున్న పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రజా వ్యతిరేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రి లేడనీ, ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయులు లేరనీ తెలంగాణలో ప్రభుత్వాలు మారినా విద్యార్థుల బతుకులు మారుతలేవనీ ఆయన ఆరోపించారు.

బంగారు తెలంగాణ అని గత ప్రభుత్వం విద్యార్ధి, నిరుద్యోగులను ఆగం చేసిందని, ప్రజా ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం విద్యార్థులను రోడ్డు మీద పడేస్తుందనీ అన్నారు.అనేక సమస్యలతో సమస్యల వలయంగా మారిన ప్రభుత్వ పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పట్టించుకొని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, నాయకులు కొప్పుల నవీన్,శశాంక్, సాయి, అరవింద్, సాయికిరణ్,తరుణ్, ప్రశాంత్,నగేష్, విష్ణు, భార్గవ్, రమణ, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube