జనాభాకు అనుగుణంగా వసతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ జనాభాకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.అమృత్ 2.0 లో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డులోని బాలానగర్లో రూ.14 కోట్ల నిధులతో నీటి సరఫరా పథకానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ ఛైర్పర్సన్ మాధవి తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్  నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు.

 Accommodation According To Population, Accommodation , Population, Mla Adi Srini-TeluguStop.com

వేములవాడ పట్టణంలో ప్రజలకు త్రాగు నీటి వసతి కల్పించేందుకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.సాగు,త్రాగు నీరు,విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు.శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా 2005 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1731 కోట్ల తో ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ బింగి మహేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube