లోకల్ యాప్ లో ఉద్యోగాల ప్రకటనల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడ్డ 05 గురు అంతర్ రాష్ట్ర నిందుతులు అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా: లోకల్ యాప్ లో ఉద్యోగాల ప్రకటనల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడ్డ 05 గురు అంతర్ రాష్ట్ర నిందుతులు అరెస్ట్.TRANZ INDIA Corporation Network అనే కంపెనీ పేరుతో మోసాలు.

 05 Inter-state Accused Have Been Arrested For Cyber Fraud In The Name Of Job Adv-TeluguStop.com

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో TRANZ INDIA Corporation Network కంపెనీ పై NCRP Portal నందు 10 కి పైగా ఫిర్యాదులు.నిందుతుల వద్ద ల్యాప్ టాప్,05 మొబైల్స్ మరియు వారి బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది.శుక్రవారం రోజున ఒక ప్రకక్తనలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

నిందుతుల వివరాలు

1.ఎర్రబద్ది గోపి s/o సుబ్రహ్మణ్యం 31 సం.లు,శారద నగర్ ,అనంతపురం , ఆంధ్ర ప్రదేశ్.
2.కురుబా అశోక్ కుమార్, తండ్రి: కలకందప్ప,age18, బ్రహ్మణపల్లి , సోమందేపల్లి మండలము, అనంతపూర్ జిల్లా.
3.మాదిగ బ్రహ్మేంద్ర s/o సంజీవప్ప, 19 సం లు,సిగుపల్లె, బీచ్అగ్నిపల్లి, అనంతపురం జిల్లా.ఆంధ్రప్రదేశ్.
4 మాదిగ స్వాతి సంజీవప్ప, 19 సం లు, సెయ్యిపల్లి గ్రామం పరిగి మండలం సత్యసాయి పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
5.కురుబ వరలక్ష్మి కలకంద, 21 సం లు, బ్రాహ్మణపల్లి గ్రామం, సోమందేపల్లి మండలం, సత్యసాయి పుట్టపర్తి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎర్రబద్ది గోపి TRANZ INDIA కార్పొరేషన్ నెట్వర్క్ అనే కంపెనీ పేరుతో అనంతపూర్ జిల్లాలో లోకల్ యాప్ లో health care, personal care, home Care, passion wear, Gold and Diamonds అను వాటి ఉత్పత్తి కంపనీల నుండి కస్టమర్లకు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇవ్వగా ఇదే కంపెనీ లో పని చేస్తున్న అశోక్, వరలక్ష్మి,బ్రహ్మేంద్ర,స్వాతి లు కలసి ప్రకటనలు చూసి ఉద్యోగం గురించి అడిగే వారికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ నమ్మకం కలిగించేలా మాట్లాడి ఆశ కల్పిస్తూ వారి వద్ద నుండి 10,000/- రూపాయల వరకు డబ్బులను తీసుకొని వారికి కంపనీ యొక్క ID ని ఇచ్చి వారిని మరి కొంత మందిని కంపనిలో చేర్పించాలని తద్వారా కమిషన్ వస్తుందని లేదా వారు చెల్లించిన డబ్బులకు కేవలము 1000/- రూపాయల విలువ గల వస్తువులను మాత్రమే వారికి ఇచ్చేవారిమని, ఇలా నిరుద్యోగులను ముల్టీ లెవల్ మార్కెటింగ్ విదానములో కంపనిలో చేర్చుకుంటూ ఆఫీసు యొక్క యజమాని గోపి కంపనీ నుండి పెద్ద మోతములో కమిషన్ పొందేవారు.

ఈ విధంగా వారి యొక్క ప్రకటనలను చూసిన సిరిసిల్ల పట్టణ నికి చెందిన దూస రమ్య అను మహిళ జాబ్ కావాలని మెసేజ్ చేయగా రమ్య తో జాబ్ ఇస్తానంటూ నమ్మబలికి మొదటగా Job verification కొరకు 400/- రూపాయలు అడుగగా రమ్య ఫోన్ పే ద్వారా పంపాగా, ఆమెతో ఫోన్ లలో మాట్లాడి జాబ్ వచ్చిందని నమ్మించగా id క్రియేషన్ కొరకు 5000 రూపాయలు రమ్యని అడుగగా 5000 రూపాయలు పంపినది.తర్వాత ఆమెకు మార్కెటింగ్ లో తమ కంపెని కి సంబంధించిన వస్తువులు అమ్మలని చెప్పగా రమ్య జాబ్ అని చెప్పారు ఎప్పుడు మార్కెటింగ్ అని చెపుతున్నారు అని అడుగగా మరో 5000 పంపిస్తే వారే జాబ్ ఇస్తాం అని చెప్పగా రమ్య మరల 5000 పంపిన తరువాత వారు రెస్పాండ్ కాకపోవడంతో వారు మోసం చేసారని గ్రహించి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా సిరిసిల్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సిరిసిల్ల పట్టణ ,సైబర్ సెల్ పోలీసులు ఈ 05 గురు నిందుతులను శుక్రవారం రోజున రాత్రి శారదా నగర్ ,అనంతపూర్ జిల్లాలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ల్యాప్ టాప్,05 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో TRANZ INDIA Corporation Network కంపెనీ పై NCRP Portal నందు 10 కి పైగా ఫిర్యాదులు ఉన్నాయని ఇట్టి ఫిర్యాదులపై కూడా FIR నమోదు చేయడం జరుగుతుందని ,ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 1930 కాల్ చేసి పిర్యాదు చేయాలని ,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube