బెదరింపులకు పాల్పడిన ఒడ్యాల వేణు అరెస్ట్ రిమాండ్ తరలింపు..

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…వేములవాడ పట్టణం అనుపురం(ఆర్ ఆర్ కాలనీ)కి చెందిన బొమ్మేళ లక్ష్మి w/o బస్వలింగం అనే మహిళకు తిప్పాపూర్ శివారులో ఉన్న ఫ్లాట్ అమ్మి తన కూతురి పెళ్లి చేయలనుకోగా వేములవాడ పట్టణానికి చెందిన వేణు s/o ప్రసాద్ అనే వ్యక్తి బొమ్మేళ లక్ష్మితో ఫ్లాట్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే ని కూతురి పెళ్లి కోసం ఆరు లక్షలు ఇస్త అని మరల ఆరు లక్షల నాకు ఇస్తే ని ఫ్లాట్ నీకు రిజిస్ట్రేషన్ చేస్తా అని నమ్మించి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఎల్లారెడ్డిపేట( ( Yellareddypet ) కి చెందిన వ్యక్తికి అమ్మాడని తెలుసుకొని లక్ష్మి వేణును అడుగగా లక్ష్మిని కులం పేరుతో తిడుతూ చంపుతానని బేధరించిగా 2022 సంవత్సరం లో వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.మరల ఒడ్యాల వేణు పెద్దమనిషుల సమక్షంలో అట్టి ఫ్లాట్ లక్ష్మి కి రిజిస్ట్రేషన్ చేయడానికి 8,50,000/- రూపాయలతో ఒప్పందం చేసుకొని ఒక లక్ష రూపాయలు తీసుకొని ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కులం పేరుతో దూషిస్తూ చంపుతానని బెదిరించగా లక్ష్మీ పిర్యాదు మేరకు వేములవాడ పట్టణంలో ఎస్సీ /ఎస్టీ కేసు నమోదు చేయగా వేములవాడ ఏఎస్పీ విచారణ చేపట్టి నేరం రుజువు కావడంతో వేణు ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.

 Odyala Venu Arrested And Remanded For Making Threats, Odyala Venu , Arrested ,-TeluguStop.com

అంతే కాక గతంలో వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో, కరీంనగర్ వన్ టౌన్, కరీంనగర్ టూ టౌన్ లో పలు చీటింగ్ కేసులు, బెదిరింపు కేసులు ,భూ సమస్యల్లో తలదూర్చి సెటిల్ మెంట్ చేయడం వట్టి కేసులు నమోదు అవ్వగా ఒడ్యాల వేణు పై రౌడి షీట్ ఓపెన్ చేయడం జరిగిదని, గతంలో వేణు పై అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉన్నదని మరల ఇలాంటి నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ పెట్టడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో వేములవాడ( Vemulawada ) పట్టణానికి చెందిన ఒడ్యాల వేణు కరీంనగర్ , వేములవాడ పరిసర ప్రాంతాల్లో భూ తగధల్లో తలదూర్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరోపణలున్న నేపథ్యంలో వేణు కిసంబంధించిన బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube