రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతదేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నలను కాపాడుకుని ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రజలందరి దీవెనలు కాంగ్రెస్ పార్టీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Chief Minister Revanth Reddy )పై ఉండాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతువేదికలో రెండవ విడత రుణమాఫీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగాలను లైవ్ ద్వారా రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీక్షించారు.
అనంతరం రాచర్ల గొల్లపల్లి బస్టాండులో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.అనంతరం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మొదటి విడత లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారని మంగళవారం 1,50,000 వరకు రుణమాఫీ( Runamafi ) చేయడం జరిగిందని రైతులందరూ సంతోషంగా ఉన్నారని రైతులు ఇప్పుడే నాట్లు వేస్తున్నారని పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు ,రెండవ విడత 6198 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డాయని రైతులందరూ హారిస్తున్నారని ఆయన అన్నారు.
రైతులు పంట నష్టం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక వెయ్యి 38 కోట్ల పంటల భీమా చేసిందన్నారు.రైతులకు వ్యవసాయం దండుగా అనే పదం దరిచేరకుండా రైతులను కాపాడుకునే విధంగా రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాహోస పేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
చిన్న చిన్న పొరపాట్ల వల్ల రుణమాఫీ జరగకపోతే తమ దృష్టికి గాని వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి సరిచేసుకొని రుణమాఫీ పొందాలన్నారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ భాయి మాట్లాడుతూ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వముదేనన్నారు.
రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ( Congress party )అంటేనే రైతుల బడుగు బలహీన వర్గాల పార్టీ అని రైతులు బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని ప్రజలకు అయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మతుల అంజిరెడ్డి,మొడుసు నారాయణరెడ్డి ,మర్రి నారాయణ రెడ్డి , గుర్రపు రాములు ,బండారి బాల్ రెడ్డి , గుండాడి రామ్ రెడ్డి , దుమాల రవి ,పందిల్ల సుధాకర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ , పొన్నాల తిరుపతిరెడ్డి , నాయక్ ,కటిక రవి , పాశం నాగిరెడ్డి , బండి పరశురాములు, కోటి మల్లేశం, తేజ , ముద్ర కొల్లా సాయి, ప్రేమ్ , పిట్ట శ్రీనివాస్, పెంజర్ల మల్లేశం , మహేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.