రాజన్న సిరిసిల్ల జిల్లా: సర్కార్ నుండి నెల కాగానే జీతం వస్తె చాలు .మా పిల్లలను కార్పొరేట్ స్కూల్ లో చదివించుకోవాలనే ఆశ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆశకు చెక్ పెట్టి ఆదర్శంగా నిలిచిన సెస్ హెల్పర్ దంపతులు.
ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ కి చెందిన ఎర్పుల సతీశ్ వృత్తిరీత్యా సెస్ ఉద్యోగిగా సిరిసిల్ల పట్టణంలో సెస్ హెల్పర్ గా పనిచేస్తున్నాడు.ఇటీవల ఎల్లారెడ్డి పేట నుండి సిరిసిల్ల కు కుటుంబంతో సహా సిరిసిల్ల లో ఉంటున్నాడు.
దీంతో తన ఇద్దరు పిల్లలు భవిష్య ,హర్ష వర్ధన్ బాబు ను సిరిసిల్ల పట్టణంలో గల అంబేడ్కర్ నగర్ లో గల పాఠశాలలో ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆలోచన మేరకు ఇద్దరి పిల్లలని ఇక్కడి సర్కార్ బడిలో చేర్పించి సెస్ ఉద్యోగులకు సతీశ్ దంపతులు ఆదర్శంగా నిలవగా వారిని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు అట్టి పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ మాజీ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ ఉన్నారు.