తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ( Director Teja) గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తేజ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకున్నాడు.
ఆ తర్వాత నువ్వు నేను, జయం లాంటి రెండు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో తనను మించిన దర్శకుడు మరొక లేరనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు.అలాంటి దర్శకుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతూ ఉండడం వల్ల ఆయన మార్కెట్ అనేది భారీగా పడిపోయింది.
ఇక ఇప్పుడు రానాతో ‘రాక్షస రాజా ( Rakshasa Raja )’ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.కానీ మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి తనని తాను నిరూపించుకొని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇంతకు ముందు రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ తర్వాత చేసిన సీత సినిమా భారీ ఫ్లాప్ అయింది.
అలాగే దగ్గుబాటి అభిరామ్ తో చేసిన సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో అంచనాలు లేకుండా పోతున్నాయి.ఇక తన కొడుకును కూడా తొందర్లోనే హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతానికైతే రానాతో రక్షస రాజా అనే సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.మరి ఈ సినిమా ఆగిపోయిందా లేదంటే షూటింగ్ జరుపుకుంటుందా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.ఇక మొత్తానికైతే తేజ కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్లు గా తెలుస్తుంది…
.