సమ్మర్ లో బార్లీ గింజల నీరు తాగితే ఎన్ని లాభాలంటే..?!

ఎండ కాలం వచ్చింది అంటే వేడితో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు ప్రజలు.దీనితో ఏం పని చేయాలన్న తోచదు.

 How-much Do You Get If You Drink Barley Seed-water In Summerbarli, Helath Benifi-TeluguStop.com

అంతేకాకుండా ఎక్కువగా నీరసం, అలసటగా అనిపించడంతో పాటు శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటకు వెళ్ళి పోతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

ఇందులో ముఖ్యంగా బార్లీ నీళ్లను సేవిస్తే ఎండాకాలంలో వచ్చే సమస్యలు అన్నీ కూడా తప్పించుకోవచ్చు.వాస్తవానికి బార్లీని ఉపయోగించి ఒక చక్కటి డ్రింక్ ను తయారు చేసుకుని సులువుగా తాగవచ్చు.

అందుకు మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దామా.

ముందుగా బార్లీ గింజలను కడిగి ఒక లీటర్ నీళ్ళు తీసుకుని అందులో బార్లీ గింజలను వేయాలి.

ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాలపాటు మరిగించి, బార్లీ గింజలను మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.ఇలా చేయడం వల్ల బార్లీ గింజలలో ఉండే పోషకాలను నీటిని కూడా నీటితో కలిసిపోతాయి.

ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి అందులో కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఎండాకాలంలో వచ్చే సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.రోజు ఉదయాన్నే పరగడుపున ఇది తాగితే చాలా మంచిది.

అంతేకాకుండా ఎండలో బయటికి వెళ్లే ముందు కానీ వెళ్లి వచ్చిన అనంతరం కానీ ఈ డ్రింక్ ఉన్న తీసుకుంటే ఎన్నో ఆరోగ్య పోషకాలను పొందవచ్చు.

ఇలా ఈ మిశ్రమం నీటిని తాగడంలో శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బయటకు రావడంతో పాటు బ్లడ్ సర్కులేషన్ ను కూడా బాగా మెరుగుపరుస్తుంది.అలాగే ఈ నీటిని సేవించడం వల్ల వడదెబ్బ తగలకుండా అనారోగ్య ఫాలో అవకుండా అలసట నీరసం ఉండకుండా జాగ్రత్త వహిస్తుంది.అలాగే బార్లీ నీటిని సేవించడం వల్ల శరీరంలోని వేడిని బయటికి పోవడంతో పాటు శరీరం చాలా చల్లగా ఉంటుంది.

అంతేకాకుండా బార్లీ నీళ్ళు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దరిచేరకుండా చూసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ఈ నీటిని తాగి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube