ప్రభాస్ ,అనుష్క( Prabhas, Anushka ) జోడీకి బాక్సాఫీస్ వద్ద ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి2 సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.
ఈ సినిమాలు ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయనే సంగతి తెలిసిందే.ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కు పోటీగా అనుష్క సినిమా రిలీజ్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమా( The Rajasaab movie ) 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఈ సినిమా విడుదలైన వారానికే అనుష్క నటించిన ఘాటీ మూవీ( ghaati movie ) విడుదల కానుంది.ఘాటీ సినిమాకు క్రిష్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.
ఘాటీ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఘాటీ సినిమా రిలీజ్ డేట్ వల్ల ది రాజాసాబ్ రిలీజ్ డేట్ లో ఏమైనా మార్పు ఉంటుందా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.ఘాటీ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సందేహాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఘాటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో అనే చర్చ జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ప్రభాస్, అనుష్క క్రేజ్ మాత్రం మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.